News April 3, 2025

ఆరు నెలల్లో రెండు ఎయిర్‌పోర్టులు సాధించాం: కోమటిరెడ్డి

image

TG: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు IAF గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 6 నెలల్లో 2 ఎయిర్‌పోర్టులు(మామునూర్, ఆదిలాబాద్) సాధించడం తమ ప్రభుత్వ కృషికి దక్కిన ఫలితమన్నారు. ఎయిర్‌పోర్టుకు కావాల్సిన అన్ని అనుమతులు పొందేలా IAFతో కలిసి తదుపరి కార్యాచరణపై నివేదిక రూపొందిస్తామని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి రామ్మోహన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News October 21, 2025

శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు

image

AP: శ్రీశైలంలో రేపటి నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసోత్సవాలు జరుగుతాయని EO తెలిపారు. కార్తీకమాసంలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. రోజూ విడతల వారీగా మల్లికార్జునస్వామి స్పర్శదర్శనం ఉంటుందని, శని, ఆది, సోమవారాల్లో కుంకుమార్చనలు నిలిపివేస్తామని వెల్లడించారు. హోమాలు, కళ్యాణాలు యథావిధిగా నిర్వహిస్తామన్నారు. అటు పుణ్యక్షేత్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

News October 21, 2025

డేంజర్: మేకప్ బ్రష్‌ను క్లీన్ చేయకపోతే..

image

మేకప్ వేసుకున్న తర్వాత కొందరు మహిళలు బ్రష్‌ను క్లీన్ చేయకుండా వదిలేస్తారు. కొద్ది రోజుల తర్వాత దాన్నే వాడుతుంటారు. ఇది ఎంతో ప్రమాదకరమని, టాయిలెట్ సీటు కంటే శుభ్రపరచని మేకప్ బ్రష్‌లపై ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ బ్రష్‌ను వాడటం వల్ల మొటిమలు, చికాకు వంటి కొత్త సమస్యలొస్తాయని తెలిపింది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మేకప్ బ్రష్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
#ShareIt

News October 21, 2025

రేపు దానధర్మాలు చేస్తే..

image

‘బలి పాడ్యమి’గా చెప్పుకొనే కార్తీక శుద్ధ పాడ్యమిన బలి చక్రవర్తిని స్మరిస్తూ దానధర్మాలు చేస్తే అక్షయ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఈరోజున బలి చక్రవర్తి భూమ్మీదకు వస్తాడని పురాణాల వాక్కు. ఈ సందర్భంగా రేపు అన్నదానం, వస్త్రదానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. గోవర్ధన, గోవుల పూజ అపమృత్యు భయాలను తొలగిస్తుందని విశ్వసిస్తారు. ఈ శుభ దినం మనలో దాతృత్వ గుణాన్ని పెంపొందిస్తుంది.