News December 18, 2024
మనకు పాతికేళ్ల నుంచి జమిలి తరహా ఎన్నికలే!

AP: రాష్ట్రంలో 25ఏళ్లుగా జమిలి తరహా ఎన్నికలు జరుగుతున్నాయి. 1999- 2024 వరకు లోక్సభకు, రాష్ట్ర అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1952- 2024 వరకు లోక్సభకు 17 సార్లు, ఏపీలో 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. రెండింటికీ కలిపి 9సార్లు ఎలక్షన్స్ నిర్వహించారు. ముందస్తు ఎన్నికలు, తదితర కారణాల వల్ల కొన్నిసార్లు సాధ్యం కాలేదు. 1952నుంచి దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీలకు మొత్తం 430సార్లు ఎన్నికలు జరిగాయి.
Similar News
News October 19, 2025
21న ‘మూరత్ ట్రేడింగ్’.. ఈ ఏడాది మారిన టైమింగ్

దీపావళి సందర్భంగా ఈ నెల 21న ప్రత్యేక ‘మూరత్ ట్రేడింగ్’ జరగనుంది. మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 గంటల వరకు నిర్వహించనున్నట్లు BSE, NSE ప్రకటించాయి. ప్రతిఏటా సాయంత్రం పూట ఈ సెషన్ జరిగేది. అయితే ఈ సారి సంప్రదాయానికి భిన్నంగా మధ్యాహ్నం నిర్వహించనున్నారు. లక్ష్మీ పూజను పురస్కరించుకొని గంటపాటు జరిగే ఈ ట్రేడింగ్లో ఒక్క షేర్ అయినా కొనాలని ఇన్వెస్టర్లు భావిస్తారు. కాగా 21, 22 తేదీల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు.
News October 19, 2025
గాజాపై దాడికి హమాస్ ప్లాన్!.. హెచ్చరించిన US

గాజాలోని పౌరులపై దాడి చేయాలని హమాస్ ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా హెచ్చరించింది. ఈ విషయంలో తమకు విశ్వసనీయ సమాచారం ఉందని US విదేశాంగ శాఖ తెలిపింది. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చెప్పింది. మీడియేషన్ ద్వారా సాధించిన పురోగతిని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఒకవేళ హమాస్ దాడి చేస్తే ప్రజలను, సీజ్ఫైర్ ఒప్పందాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
News October 19, 2025
బౌద్ధుల దీపావళి.. ఎలా ఉంటుందంటే?

దీపావళి బౌద్ధుల పండుగ కానప్పటికీ వజ్రయాన శాఖకు చెందినవారు దీన్ని వేడుకగా జరుపుకొంటారు. నేపాల్లోని ‘నేవార్’ ప్రజలు ‘తిహార్’ పేరుతో 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రపంచ స్వేచ్ఛ కోసం ఏ దేవతనైనా ఆరాధించవచ్చనే ఆచారం ప్రకారం వీరు లక్ష్మీదేవిని, విష్ణువును తమ దైవాలుగా భావించి పూజిస్తారు. ఈ పండుగ సందర్భంగా లక్ష్మీదేవిని ప్రార్థించడం ద్వారా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్ముతారు.