News March 19, 2024
3 నెలల్లో 30వేల ఉద్యోగాలిచ్చాం: వేణుగోపాల్
TG: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్ అన్నారు. గ్రామీణ యువత, మహిళల సమస్యలను పరిష్కరిస్తూ దేశ ప్రజలకు హామీలు ఇస్తున్నామన్నారు. కర్ణాటక, తెలంగాణలో ప్రకటించిన గ్యారంటీలను అమలు చేశామని అన్నారు. అదే విధంగా దేశ ప్రజలకు కూడా హామీలు ఇస్తున్నామని, వాటిని నెరవేరుస్తామని పేర్కొన్నారు.
Similar News
News January 7, 2025
కాసేపట్లో కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ హైదరాబాద్ బేగంపేట్‌లోని కిమ్స్ ఆస్పత్రికి బయల్దేరారు. తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ 35 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. పోలీసుల అనుమతితో బాలుడిని పరామర్శించేందుకు బన్నీ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కిమ్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
News January 7, 2025
కలకలం.. అమెరికాలో తొలి బర్డ్‌ఫ్లూ మరణం
USలో బర్డ్‌ఫ్లూ కారణంగా తొలిసారి ఓ మనిషి చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. లూసియానాలో 65 ఏళ్ల వృద్ధుడు అడవి పక్షుల కారణంగా H5N1 వైరస్ సోకి ఆస్పత్రిలో చేరాడని, చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. USలో ఇప్పటి వరకు 66 మందికి బర్డ్‌ఫ్లూ సోకింది. అయితే మనుషుల నుంచి మనుషుల్లో వ్యాప్తికి ఆధారాలు లభించలేదు. గతంలో బర్డ్‌ఫ్లూ సోకి మెక్సికోలో ఓ వ్యక్తి చనిపోయాడు.
News January 7, 2025
సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలు.. వారం రోజులే గడువు
దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరో క్లాస్‌కు అభ్యర్థుల వయసు మార్చి 31, 2025 నాటికి 10-12ఏళ్లు, 9వ క్లాస్‌కు 13-15ఏళ్లు ఉండాలి. హాల్ టికెట్స్ డౌన్లోడ్, ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఎగ్జామ్ ఉంటుంది. పరీక్ష విధానం, సిలబస్ కోసం <
సైట్: https://exams.nta.ac.in/AISSEE/