News July 23, 2024

ఏపీకి ₹35,492 కోట్లు ఇచ్చాం: కేంద్రం

image

AP: రాష్ట్రానికి ఇప్పటివరకు ₹35,492 కోట్ల ఆర్థికసాయం అందించినట్లు కేంద్రం వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు కోసం ₹15,147కోట్లు, అమరావతికి ₹2500 కోట్లు, రాయలసీమకు ₹1,750 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. గత ఐదేళ్లలో వివిధ పథకాల ద్వారా ఏపీ ₹63వేల కోట్లు లబ్ధి పొందిందని వెల్లడించింది. గరిష్ఠంగా FY23లో రాష్ట్రానికి కేంద్ర పథకాల ద్వారా ₹16,114 కోట్ల లబ్ధి చేకూరిందని నిన్న పార్లమెంటులో వివరించింది.

Similar News

News January 9, 2026

OTTలోకి కొత్త సినిమాలు

image

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ ఈరోజు నుంచి Netflixలో 5 భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అటు మురళీ మనోహర్ డైరెక్షన్‌లో నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ‘గుర్రం పాపిరెడ్డి’ ఈ నెల 16న ZEE5లోకి రానుంది. మరోవైపు శోభితా ధూళిపాళ్ల నటించిన ‘చీకటిలో’ సినిమా ఈ నెల 23న నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతోంది. దీనికి శరత్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు.

News January 9, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 9, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.22 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.58 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.15 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 9, 2026

ఈడీ vs ఐప్యాక్: హైకోర్టుకు చేరిన వివాదం!

image

కోల్‌కతాలోని ఐప్యాక్ ఆఫీసులో ED చేసిన <<18797775>>రెయిడ్స్‌<<>>పై రోజంతా హైడ్రామా నడిచింది. మమత వర్సెస్ ఈడీ అన్నట్లు సాగిన ఈ వ్యవహారం చివరికి కలకత్తా హైకోర్టుకు చేరింది. ఈడీ, ఐప్యాక్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. బెంగాల్ కోల్ మైనింగ్ స్కామ్‌కు సంబంధించి తాము సోదాలు చేశామని, తమను మమత అడ్డుకున్నారని ఈడీ తమ పిటిషన్లో పేర్కొంది. ఈడీ రెయిడ్స్‌ను ఆపేలా ఆదేశించాలని ఐప్యాక్ అభ్యర్థించింది.