News July 23, 2024

ఏపీకి ₹35,492 కోట్లు ఇచ్చాం: కేంద్రం

image

AP: రాష్ట్రానికి ఇప్పటివరకు ₹35,492 కోట్ల ఆర్థికసాయం అందించినట్లు కేంద్రం వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు కోసం ₹15,147కోట్లు, అమరావతికి ₹2500 కోట్లు, రాయలసీమకు ₹1,750 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. గత ఐదేళ్లలో వివిధ పథకాల ద్వారా ఏపీ ₹63వేల కోట్లు లబ్ధి పొందిందని వెల్లడించింది. గరిష్ఠంగా FY23లో రాష్ట్రానికి కేంద్ర పథకాల ద్వారా ₹16,114 కోట్ల లబ్ధి చేకూరిందని నిన్న పార్లమెంటులో వివరించింది.

Similar News

News January 25, 2025

ప్రేక్షకుల అభిప్రాయమే నాకు ముఖ్యం: అనిల్ రావిపూడి

image

వరుస విజయాలు కట్టబెడుతూ ప్రేక్షకులు చాలా ఇచ్చారని, ప్రతిఫలంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడమే తన లక్ష్యమని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ఆడియన్స్ ఖర్చు పెట్టే ప్రతిపైసాకు న్యాయం చేస్తానన్నారు. థియేటర్లకు వచ్చే జనం, కలెక్షన్లనే సక్సెస్‌గా మాట్లాడుకుంటున్నామని చెప్పారు. క్రిటిక్స్ ఎప్పుడూ ఉంటారని, వారి మాటలతో ఒత్తిడికి లోనవ్వనని తెలిపారు. తనకు ప్రేక్షకుల అభిప్రాయమే ముఖ్యమని ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

News January 25, 2025

దక్షిణ జార్జియాను ఢీకొట్టనున్న భారీ ఐస్‌బర్గ్‌!

image

అంటార్కిటికా నుంచి విడిపోయిన ఓ భారీ మంచుకొండ(A23a) బ్రిటిష్ భూభాగం వైపు దూసుకెళ్తోంది. ఇది మున్ముందు దక్షిణ జార్జియా ద్వీపాన్ని ఢీకొనే అవకాశముంది. ఆ ప్రాంతానికి 280KM దూరంలో ఉన్న ఈ ఐస్‌బర్గ్ బలమైన గాలులు, సముద్ర ప్రవాహాల వల్ల వేగంగా కదులుతోంది. 4K చ.కి.మీ. వైశాల్యం ఉండే మంచుకొండ ఆ ద్వీపాన్ని ఢీకొట్టి అక్కడే చిక్కుకునే ప్రమాదముంది. దీంతో అందులోని పెంగ్విన్లు, సీల్స్‌కు ఆహారం దొరకడం కష్టమవుతుంది.

News January 25, 2025

నేడు షమీ ఆడతారా?

image

భారత స్టార్ బౌలర్ షమీ నేడు ఇంగ్లండ్‌తో జరిగే 2వ T20 ఆడటంపై సందిగ్ధత కొనసాగుతోంది. నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న షమీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేశారు. అయితే మోకాలికి బ్యాండేజ్ వేసి ఉండటంతో మ్యాచ్ ఆడటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలి T20 ఆడతారని భావించినా డగౌట్‌కే పరిమితమయ్యారు. అటు షమీ ఆరోగ్య పరిస్థితిపై BCCI ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫ్యాన్స్ మాత్రం షమీ ఆడాలని కోరుకుంటున్నారు.