News December 3, 2024
దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు పెంచింది మేమే: మంత్రి డోలా

AP: ఇవాళ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వారికి మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వారి పింఛన్ను రూ.6వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. విశాఖలో దివ్యాంగుల స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వారికి అవసరమైన త్రీవీలర్స్, పరికరాలను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.
Similar News
News December 7, 2025
ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం Jr.NTR చాలా సన్నగా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కొత్త లుక్ వైరల్ అవుతోంది. గాగుల్స్ పెట్టుకుని సోఫాలో కూర్చున్న ఫొటో చూసి లుక్ బాగుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కొత్త షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో బాడీ డబుల్ లేకుండా ఎన్టీఆరే స్టంట్స్ చేస్తారని సమాచారం.
News December 7, 2025
మామిడిలో బోరాన్, పొటాష్ లోపాన్ని ఎలా గుర్తించాలి?

మామిడిలో బోరాన్ లోపం వల్ల చెట్ల ఆకులు కురచగా మారి ఆకుకొనలు నొక్కుకుపోయి పెళుసుగా మారతాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి. దీని నివారణకు ప్రతి మొక్కకు 100గ్రా. బోరాక్స్ భూమిలో వేయాలి. లేదా లీటరు నీటికి 1ml-2ml బోరాక్స్ లేదా బోరికామ్లం కొత్త చిగురు వచ్చినప్పుడు 1-2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుల అంచులు ఎండిపోతే పొటాష్ లోపంగా గుర్తించాలి. దీని నివారణకు లీటరు నీటికి 13:0:45 10గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News December 7, 2025
హనుమాన్ చాలీసా భావం – 31

అష్ట సిద్ధి నవ నిధి కే దాతా|
అసవర దీన్హ జానకీ మాతా||
హనుమంతుడు 8 రకాల సిద్ధులు, 9 రకాల సంపదలు ఇవ్వగలిగే సామర్థ్యం కలవాడు. ఈ అద్భుతమైన, అత్యున్నతమైన వరాన్ని సాక్షాత్తు సీతాదేవి లంకలో ప్రసాదించింది. కాబట్టి, హనుమంతుడు తన భక్తులకు అన్ని రకాల శక్తులను, సంపదలను, కోరిన కోరికలను తీర్చగలిగే శక్తిమంతుడు అని మనం గ్రహించాలి. <<-se>>#HANUMANCHALISA<<>>


