News August 30, 2025
కుటుంబసభ్యులను కోల్పోయాం.. వారిని భర్తీ చేయలేం: RCB

బెంగళూరు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి RCB యాజమాన్యం తాజాగా పరిహారం ప్రకటించింది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున అందించినట్లు ట్వీట్ చేసింది. ‘RCB కుటుంబంలోని 11 మందిని కోల్పోయాం. వారు మనలో భాగం. ఎన్ని డబ్బులిచ్చినా వారి స్థానాన్ని భర్తీ చేయలేం. కానీ మొదటి అడుగుగా రూ.25లక్షలు ఇచ్చాం’ అని ట్వీట్ చేసింది. ఘటన జరిగిన 3 నెలల తర్వాత RCB ఈమేరకు స్వయంగా స్పందించింది.
Similar News
News August 30, 2025
గుండెపోటుతో కార్డియాలజిస్ట్ మృతి.. ఒత్తిడి వల్లేనా?

చెన్నైకి చెందిన 39 ఏళ్ల గుండె వైద్యుడు డా.గ్రాడ్లిన్ రాయ్ ఆస్పత్రిలోనే గుండెపోటుతో చనిపోయారు. ఎక్కువ పనిగంటలు, నిద్రలేమి, అధిక ఒత్తిడి, జీవనశైలి వల్ల ఏటా ఇండియాలో చాలామంది వైద్యులు చనిపోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇతరులతో పాటు వైద్యులు కూడా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని, నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. యోగా చేయడం, ధూమపానం & మద్యపానానికి దూరంగా ఉండాలంటున్నారు.
News August 30, 2025
అందుకే ముగ్గురు పిల్లలను కనాలనుకుంటున్నా: జాన్వీ కపూర్

తాను ముగ్గురు పిల్లలను కనాలనుకుంటున్నట్లు హీరోయిన్ జాన్వీ కపూర్ గతంలో తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ‘పరమ్ సుందరి’ ప్రమోషన్లలో ఆమె స్పందించారు. ‘నా లక్కీ నంబర్ 3. పెళ్లి తర్వాత ముగ్గురికి జన్మనిస్తా. వారిలో ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు మూడో బిడ్డ ఎవరికి సపోర్ట్ చేస్తారో నేను చూడాలి. సందర్భాన్ని బట్టి వాళ్ల మద్దతు మారుతూ ఉంటుంది. ఇలా నా బిడ్డలందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు’ అంటూ చెప్పారు.
News August 30, 2025
5.5 లక్షల ఎకరాల్లో సోలార్ ప్రాజెక్ట్.. ప్రపంచంలోనే అతి పెద్దది!

గుజరాత్‌లోని కచ్ జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ‘ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్’ పేరిట దాదాపు 5.5 లక్షల ఎకరాల్లో దీనిని చేపట్టనుంది. ఇది సింగపూర్ దేశ విస్తీర్ణం కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఇది 100 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయనుంది. ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణ కోసం స్థానికులకు వేలాది ఉద్యోగాలు రానున్నాయి.