News March 17, 2024
ఏపీని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాం: మోదీ

ఏపీని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బొప్పూడి సభలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాం తిరుపతిలో ఐఐటీ, ఐసర్, విశాఖలో ఐఐఎం, ఐఐపీఈ, మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మించాం. విజయనగరం జిల్లాలో జాతీయ గిరిజన వర్సిటీ ఏర్పాటు చేశాం. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకే ఈ సంస్థలను స్థాపించాం’ అని తెలిపారు.
Similar News
News November 1, 2025
మహిళలకు నివాస హక్కు

ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్, 2005 ప్రకారం, ఒక మహిళ తన వైవాహిక లేదా ఉమ్మడి ఇంట్లో నివసించే హక్కును కలిగి ఉంది. ఆమె సొంతం కాకపోయినా లేదా ఆమె పేరు రెంటల్ అగ్రిమెంట్లో లేకపోయినా ఆమె అక్కడ నివసించే హక్కు ఉంటుంది. ఆమె భర్త లేదా అత్తమామలు ఆమెను చట్టబద్ధంగా వెళ్ళగొట్టలేరు.
News November 1, 2025
ఈ వృక్షాన్ని పూజిస్తే.. కుబేరుడి అనుగ్రహం

పవిత్ర ప్రబోధిని ఏకాదశి రోజున కదంబ వృక్షాన్ని పూజిస్తే విష్ణువు కటాక్షం తప్పక లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ దేవతా వృక్షం శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఆయన ఈ చెట్టు కిందే వేణువు వాయించేవాడని పురాణాల వాక్కు. అందుకే ఈ చెట్టుకు ప్రభోధిని ఏకాదశి రోజున పూజ చేయాలని చెబుతారు. పసుపు, పువ్వులు సమర్పించి భక్తితో పూజిస్తే అదృష్టంతో పాటు కుబేరుడి అనుగ్రహం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం.
News November 1, 2025
POKలో మానవహక్కుల ఉల్లంఘన: UNలో భారత్ ఫైర్

పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లో ప్రజల తిరుగుబాటును అక్కడి దళాలు అణచివేస్తున్నాయని UN వేదికగా భారత్ ఫైరయ్యింది. అక్కడ తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని IND దౌత్యవేత్త భావికా మంగళానందన్ ధ్వజమెత్తారు. అక్కడి దారుణాలను ఆపకుండా భారత్‌పై నిందలు మోపేందుకు ఆ దేశ దౌత్యవేత్తలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పాక్ కపట వైఖరి అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.


