News October 25, 2024

మరో రూ.300 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించాం: మంత్రి

image

AP: పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ‘ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) కింద నెట్‌వర్క్ ఆసుపత్రులకు మాజీ సీఎం జగన్ పెట్టిన రూ.2500కోట్ల బకాయిలలో మరో రూ.300 కోట్లు ఇవాళ చెల్లించాం. రాష్ట్రం అప్పుల నుంచి అభివృద్ధి వైపు, సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా పయనిస్తోంది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 15, 2025

SSMB29: టైటిల్ ‘వారణాసి’

image

రాజమౌళి- మహేశ్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న SSMB29 సినిమాకు ‘వారణాసి’ టైటిల్ ఖరారైంది. అలాగే మహేశ్ క్యారెక్టర్‌ను రుద్రగా పరిచయం చేస్తూ రాజమౌళి పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో మహేశ్ నందిపై కూర్చున్న లుక్ అదిరిపోయింది. GlobeTrotter పేరుతో ప్రస్తుతం RFCలో ఈవెంట్ గ్రాండ్‌గా కొనసాగుతోంది.

News November 15, 2025

ఓటింగ్‌కి ముందు వీడియోలు వైరల్.. వివాదాల నడుమ విజయం

image

బిహార్ బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్ పిన్టూ సీతామఢీ‌లో విజయం సాధించారు. అయితే ఓటింగ్‌కు ముందు పిన్టూ ఓ మహిళతో అభ్యంతరకరమైన రీతిలో ఉన్నట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే అవి ఫేక్ అని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023లోనూ ఇదే విధంగా ఫేక్ వీడియోలు క్రియేట్ చేశారన్నారు. గతంలో ఎంపీగా పనిచేసిన పిన్టూ, తాజా ఎన్నికల్లో RJD అభ్యర్థి సునీల్ కుమార్ కుశ్వాహాను ఓడించారు. పిన్టూకి 1,04,226 ఓట్లు వచ్చాయి.

News November 15, 2025

పార్టీ పరంగా 50% రిజర్వేషన్లకు ఖర్గే గ్రీన్ సిగ్నల్?

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై మరో ముందడుగు పడింది. పార్టీ పరంగా BCలకు 50% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీకి వెళ్లిన CM రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, PCC చీఫ్ మహేశ్ ఈ విషయాన్ని ఖర్గే దృష్టికి తీసుకెళ్లగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అటు ఎల్లుండి జరిగే క్యాబినెట్‌లో రిజర్వేషన్లపై చర్చించనున్నారు.