News March 17, 2025
రూ.400కోట్లు పన్నులు చెల్లించాం: శ్రీరామ జన్మభూమి ట్రస్ట్

మహాకుంభమేళా సమయంలో కోటి 26లక్షల మంది భక్తులు అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. గత ఐదేళ్లలో రూ. 400కోట్ల పన్నులు ప్రభుత్వానికి చెల్లించినట్లు కార్యదర్శి వెల్లడించారు. అయోధ్యకు వచ్చే భక్తులు, పర్యాటకులు సంఖ్య 10రెట్లు పెరిగిందని, స్థానికుల ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. గతేడాది 5కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు.
Similar News
News March 17, 2025
Stock Markets: భారీ లాభాల్లో మొదలవుతాయా!

దేశీయ స్టాక్‌మార్కెట్లు రేంజుబౌండ్ నుంచి పాజిటివ్‌గా మొదలవ్వొచ్చు. గిఫ్ట్‌నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో ట్రేడవుతుండటం దీనినే సూచిస్తోంది. జకార్తా మినహా ఆసియా మేజర్ సూచీలన్నీ ఎగిశాయి. నిఫ్టీ రెసిస్టెన్సీ 22,513, సపోర్టు 22,375 వద్ద ఉన్నాయి. మెటల్, కమోడిటీస్, చమురు, CPSE, ఎనర్జీ, ఇన్ఫ్రా రంగాల్లో మూమెంటమ్ కనిపిస్తోంది. Stocks to Focus: ఇండస్‌ఇండ్, KEC, వెల్‌స్పన్, ఆల్కెమ్, శిల్పా మెడికేర్, Dr రెడ్డీస్
News March 17, 2025
పరీక్షలే జీవితం కాదు.. ఆల్ ది బెస్ట్: హోంమంత్రి

AP: పబ్లిక్ పరీక్షల వేళ విద్యార్థులు టెన్షన్ పడొద్దని హోంమంత్రి అనిత సూచించారు. ‘జీవితంలో పదోతరగతి పరీక్షలు కీలకమే. కానీ అవే జీవితం కాదు. ఏడాదిపాటు నిద్రపోకుండా చదివిన మీ కష్టాన్ని ప్రతిబింబించేలా ప్రతి ప్రశ్నకు నైపుణ్యంతో జవాబు రాయండి. కేంద్రానికి ముందుగానే వెళ్లి మనసుని ప్రశాంతంగా ఉంచుకుని పరీక్షలు బాగా రాయండి. ఆల్ ది బెస్ట్’ అని ట్వీట్ చేశారు.
News March 17, 2025
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ

AP: రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3గంటలకు సచివాలయంలో మంత్రులు భేటీ కానున్నారు. సీఆర్‌డీఏ ఆమోదించిన రూ.37,702 కోట్ల టెండర్ల పనులను ఈ సమావేశంలో ఆమోదించనున్నారు. అదే విధంగా స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు 4వ సమావేశంలో ఆమోదించిన అంశాలపైనా చర్చించి వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.