News April 10, 2024
లంచాలు, వివక్ష లేని పాలన అందించాం: సీఎం

AP: ప్రపంచంలోనే వ్యవసాయం దండగ అన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు అని CM జగన్ ఫైర్ అయ్యారు. ‘రైతు రుణమాఫీ, సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ హామీలన్నీ ఎగ్గొట్టాడు. రైతన్నలకు మేం తోడుగా నిలిచాం. మోసాలు చేసే చంద్రబాబు కావాలా? లేక వ్యవసాయానికి అండగా ఉంటున్న జగన్ కావాలా? సంక్షేమ కార్యక్రమాలతో రూ.2.70 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో వేశాం. లంచాలు, వివక్ష లేకుండా పాలన, పథకాలు అందించాం’ అని చెప్పుకొచ్చారు.
Similar News
News November 22, 2025
తీవ్ర పోటీ: రంగారెడ్డి DCC పెండింగ్!

AICC కొత్తగా DCC ప్రెసిడెంట్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని నియమించకపోవడం చర్చనీయాంశమైంది. RCపురానికి చెందిన దేప భాస్కర్ రెడ్డి, బడంగ్పేట మాజీ మేయర్ చిగురింత నర్సింహా రెడ్డి, చేవెళ్ల నుంచి భీంభరత్, ఎల్బీనగర్ నేత రాంమోహన్ గౌడ్, షాద్నగర్ నుంచి మాజీ MLA ప్రతాప్ రెడ్డి DCC ఆశించినట్లు తెలిసింది. పెండింగ్లో ఉంచడానికి తీవ్ర పోటీ ప్రధాన కారణమని సమాచారం.
News November 22, 2025
BREAKING: నిజామాబాద్ DCC అధ్యక్షుడిగా నగేష్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కాట్పల్లి నగేష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఆయన నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా కూడా పని చేశారు. ఇక నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణను నియమించారు.