News April 6, 2024

మా టార్గెట్ రీచ్ అయ్యాం: దిల్ రాజు

image

‘ఫ్యామిలీ స్టార్’ మూవీ విషయంలో టార్గెట్ రీచ్ అయ్యామని నిర్మాత దిల్ రాజు అన్నారు. మీడియా నుంచి రివ్యూస్ ఒకలా ఉన్నాయని.. కుటుంబ ప్రేక్షకుల నుంచి టాక్ వేరేలా ఉందన్నారు. వారిలో 90శాతం మందికి ఫ్యామిలీ స్టార్ మూవీ నచ్చిందని పేర్కొన్నారు. కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని సినిమా తీసినట్లు చెప్పారు. కుటుంబాన్ని గొప్ప స్థాయిలోకి తీసుకొచ్చిన ఫ్యామిలీ స్టార్స్‌ని గుర్తించి కలవనున్నట్లు తెలిపారు.

Similar News

News December 28, 2025

90 పైసలకే 50 ఎకరాలా: పేర్ని నాని

image

AP: చంద్రబాబు నోట PPP, P4 మాటలే వస్తున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పీపీపీ టెండర్లకు ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే వారు వ్యాపారం మాత్రమే చేస్తారనే విషయాన్ని మర్చిపోతున్నారని వ్యాఖ్యానించారు. విశాఖలో భూములు దోచుకుంటున్నారని, 90 పైసలకే 50 ఎకరాలు కట్టబెడుతున్నారని ఆరోపించారు. సామాన్యులు, పేదల పట్ల చంద్రబాబు దృక్పథం మారట్లేదన్నారు.

News December 28, 2025

మిరపలో ఆకు ముడత తెగులు – లక్షణాలు

image

మిరపసాగులో ఆకుముడత తెగులు గతంలో తామర పురుగులు, పేను, దోమ వలన వచ్చేది. నేడు వీటితో పాటు జెమినీ వైరస్, మొజాయిక్ వైరస్‌లు కూడా ఈ ముడత తెగులు పురుగుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై, లేత పసుపు రంగుకు మారతాయి. ఆకులు పైకి ముడుచుకొని, రెమ్మలు గిడసబారుతాయి. మొక్కలు బలహీనపడి, పూత, పిందె సరిగా కట్టవు. దీనివల్ల పంట పెరుగుదలకు నష్టం వాటిల్లి, దిగుబడి తగ్గుతుంది.

News December 28, 2025

భారీ జీతంతో ESIC ఢిల్లీలో ఉద్యోగాలు

image

<>ESIC <<>>ఢిల్లీ 28 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 30న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS, PG/DNB/డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.1,48,669 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rodelhi.esic.gov.in