News January 4, 2025
చిరంజీవి వల్లే ఈ స్థాయికి వచ్చాం.. మూలాలు మర్చిపోం: పవన్

తాము ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం చిరంజీవి అని Dy.CM పవన్ తెలిపారు. ‘మీరు గేమ్ ఛేంజర్ అనొచ్చు. ఓజీ అనొచ్చు. కానీ దానికి ఆద్యులు చిరంజీవి. మొగల్తూరు అనే గ్రామం నుంచి వచ్చి ఆయన ఈస్థాయికి వచ్చారు. మేమెప్పుడూ మూలాలు మర్చిపోం. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టారే అవుతారు. రంగస్థలంలో నటన చూసి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలని అనిపించింది. భవిష్యత్తులో కచ్చితంగా అందుకుంటారు’ అని చెప్పారు.
Similar News
News December 20, 2025
నేటి నుంచి స్కూళ్లు, కాలేజీల్లో ‘ముస్తాబు’

AP: విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతను పెంచే ఉద్దేశంతో స్కూళ్లు, కాలేజీల్లో నేటి నుంచి ‘ముస్తాబు’ కార్యక్రమం అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి శుభ్రమైన యూనిఫాం, బూట్లు ధరించాలి. గోర్లు కత్తిరించుకోవాలి. జుట్టు నీట్గా దువ్వుకోవాలి. టాయిలెట్కు వెళ్లొచ్చాక, భోజనం చేసే ముందు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. ప్రతి వారం ‘ముస్తాబు స్టార్స్’ పేర్లు ప్రదర్శిస్తారు.
News December 20, 2025
ప్రెగ్నెన్సీలో జున్ను తినొచ్చా?

జున్నులో ఇమ్యునోగ్లోబులిన్ అధికంగా ఉంటుంది. ప్రోటీన్లు, విటమిన్లు A, E, మినరల్స్ పుష్కలంగా ఉండటం వలన తల్లికి, గర్భంలోని శిశువుకు కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కానీ జున్ను పాలను సరిగా ఉడికించకుండా తీసుకుంటే ఇందులోని హానికరమైన బ్యాక్టీరియాల వల్ల గర్భిణికి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
News December 20, 2025
ఎప్స్టీన్ ఫైల్స్.. వేలాది ఫొటోలు ఎలా, ఎక్కడ చూడాలి?

అమెరికా లైంగిక నేరగాడు ఎప్స్టీన్కు సంబంధించిన వేలాది డాక్యుమెంట్లు, ఫొటోలను US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేస్తోంది. వీటిని <


