News December 31, 2024

BSNLకు మారిపోయాం.. సిగ్నలేది సార్!

image

ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు టారిఫ్ రేట్లను పెంచడంతో చాలా మంది ప్రభుత్వరంగ సంస్థ అనే అభిమానంతో BSNLకు పోర్ట్ అయ్యారు. కానీ చాలా చోట్ల సిగ్నల్ అస్సలు రావడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. సిగ్నల్ లేనప్పుడు మంచి మంచి ఆఫర్లు పెట్టి లాభమేంటని ప్రశ్నిస్తున్నారు. కాగా వచ్చే ఏడాది మే నాటికి 4G, జూన్ నాటికి 5G వస్తుందని BSNL చెబుతోంది. మరి BSNL సిగ్నల్ సమస్యలు మీకూ ఉన్నాయా? కామెంట్ చేయండి.

Similar News

News December 4, 2025

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి గురువారం ఆలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కళ్యాణోత్సవాలను విజయవంతం చేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News December 4, 2025

సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత

image

కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్(73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని లోధి రోడ్డులో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బీజేపీ తెలిపింది. సీనియర్ న్యాయవాది అయిన కౌశల్ గతంలో మిజోరం గవర్నర్‌గా పనిచేశారు. కాగా 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. సుష్మా-కౌశల్ దంపతులకు బన్సూరి స్వరాజ్ అనే కూతురు ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా సేవలందిస్తున్నారు.

News December 4, 2025

కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులకూ నెలసరి సెలవులు

image

ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకూ నెలసరి సెలవులను(ఏడాదికి 12) వర్తింపజేస్తూ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అదనంగా 1.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రైవేట్ రంగాల్లోని మహిళలకు(18-52 ఏళ్లు) పెయిడ్ లీవ్‌ను తప్పనిసరి చేస్తూ గత నెల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. కాగా బిహార్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు, కేరళలో యూనివర్సిటీ సిబ్బందికి నెలసరి సెలవులు ఇస్తున్నాయి.