News May 4, 2024

తాడోపేడో తేల్చుకోవాల్సిందే..

image

ఐపీఎల్2024 కీలక దశకు చేరింది. ప్లేఆఫ్స్‌లో బెర్తు కోసం జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాగా.. ఈసారి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన బెంగళూరు, గుజరాత్ ఈరోజు తాడోపేడో‌ తేల్చుకునే మ్యాచ్‌లో తలపడనున్నాయి. గెలిచిన జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాల సంగతి పక్కన పెడితే.. ఓడిన జట్టు మాత్రం ఇంటిముఖం పట్టక తప్పదు. GT 8, RCB 6 పాయింట్లతో 8, 10వ స్థానాల్లో ఉన్నాయి. ఇరుజట్ల ముఖాముఖీ పోరులో 2-2తో సమవుజ్జీలుగా ఉన్నాయి.

Similar News

News November 23, 2025

సత్యసాయి సిద్ధాంతాలు ఇవే: చంద్రబాబు

image

AP: 102 సత్యసాయి స్కూళ్లలో 60వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస సిద్ధాంతాలుగా సత్యసాయిబాబా నూతన అధ్యాయం ప్రారంభించారు. తన మహిమలతో అన్ని మతాలు ఒక్కటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారు. దేశవిదేశాల నుంచి దేశాధినేతలు వచ్చి సత్యసాయిబాబాను దర్శించుకున్నారు. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలి’ అని పుట్టపర్తిలో తెలిపారు.

News November 23, 2025

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

అసోంలోని దులియాజన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్‌ 3 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 27న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 24 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.70వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.oil-india.com/

News November 23, 2025

మిరియాలతో ఎన్నో ప్రయోజనాలు

image

మిరియాలు ప్రతి వంటింట్లో కచ్చితంగా ఉంటాయి. వీటివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. వీటిలో మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. ఇవి బరువును తగ్గించడం, క్యాన్సర్‌ నివారణ, డయాబెటీస్ కంట్రోల్‌లో ఉంచడం, గుండె ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ పనితీరును పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అయితే కడుపులో మంట ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవాలి.