News April 16, 2025

ప్రభుత్వానికి ఇప్పుడైనా జ్ఞానం వస్తుందని ఆశిస్తున్నాం: కేటీఆర్

image

TG: కంచ గచ్చిబౌలి అడవిని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడైనా జ్ఞానం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. నగరంలోని 400 ఎకరాల అడవిని రక్షించడానికి విద్యార్థులు, అధ్యాపకులు అవిశ్రాంతంగా కృషి చేశారని అభినందించారు. ఆ భూముల తనఖా వ్యవహారంపై సుప్రీంకోర్టు కమిటీని రికమెండ్ చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు.

Similar News

News February 4, 2026

కాలం చెల్లిన పురుగుమందులు వాడితే?

image

పంటల్లో పురుగులను చంపడానికి వాడే మందులు గడువు దాటినా ఇబ్బందేముందని కొందరు అనుకుంటారు. కానీ అలాంటివి వాడటం ఏమాత్రం మంచిదికాదు. కాలం చెల్లిన మందులకు రసాయనశక్తి తగ్గడంతో పురుగులు చావకపోగా మరింత విజృంభిస్తాయి. కొన్ని రకాల మందులు హానికరమైన కెమికల్స్‌గా మారిపోతాయి. దీనివల్ల పంట ఎండిపోతుంది. ఇవి స్ప్రే చేసిన రైతులకు ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. కాబట్టి మందులను కొనేటప్పుడు ఎక్స్‌పైర్ డేట్ చూడండి.

News February 4, 2026

అరక అరిగిన గరిసె విరుగును

image

‘అరక’ అంటే పొలం దున్నడానికి ఉపయోగించే నాగలి. ‘గరిసె’ అంటే ధాన్యాన్ని నిల్వచేసే కొట్టం. ఒక రైతు తన నాగలి అరిగిపోయేంత కష్టపడి పొలం దున్నితే, ఆ శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని, ధాన్యం దిగుబడి విపరీతంగా పెరిగి, ధాన్యాగారా(గరిసె)లు నిండిపోతాయని దీని అర్థం. ఎంత కష్టపడి శ్రమిస్తే, అంత గొప్ప ఫలితాలు లభిస్తాయి అనే నీతిని ఈ సామెత తెలియజేస్తుంది.

News February 4, 2026

ప్రేమ, కరుణకు కేంద్రం ‘అనాహత చక్రం’

image

ఛాతీ మధ్యలో ఉండే ఈ చక్రం ప్రేమ, కరుణకు కేంద్రం. ఇది సమతుల్యంగా ఉంటే అందరిపై నిస్వార్థమైన ప్రేమ, క్షమాగుణం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. అస్థిరత ఏర్పడితే ఒంటరితనం, గుండె సంబంధిత ఇబ్బందులు, ఇతరులపై ద్వేషం కలుగుతాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి ‘యం’ మంత్రాన్ని జపించాలి. ఆకుపచ్చని ప్రకృతిలో సమయం గడపడం, ప్రాణాయామం చేయడం, సాటి జీవుల పట్ల దయతో మెలగడం వల్ల ఈ చక్రం అద్భుతంగా పని చేస్తుంది.