News May 15, 2024
అల్లర్లు సృష్టించిన వారిని గుర్తించాం: ముకేశ్

ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌ల వద్ద అల్లర్లు సృష్టించిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందని ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సీసీ కెమెరాల్లో అంతా రికార్డయిందని, దాడులు చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు. తాడిపత్రి, నరసరావుపేటలో ఘర్షణ వాతావరణం నెలకొందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 715 పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామన్న ముకేశ్ కుమార్.. నాలుగు చోట్ల 144 సెక్షన్ విధించామన్నారు.
Similar News
News April 6, 2026
లేబర్ వెల్ఫేర్ పథకాల ప్రచారానికి కమిటీలు

AP: నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రచారం కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ-టెండర్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు టెండర్ ఈవాల్యుయేషన్, అప్రూవల్ కమిటీలను నియమిస్తూ కార్యదర్శి శేషగిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ-శ్రామ్ నమోదు, బాండెడ్ లేబర్ అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కమిటీల ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం పారదర్శకతకు ప్రాధాన్యమిస్తోంది.
News April 6, 2026
సీజ్‌ఫైర్‌ను తిరస్కరించిన ఇరాన్.. ట్రంప్ వార్నింగ్!

సీజ్‌ఫైర్‌పై పాకిస్థాన్ ద్వారా US పంపిన ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరించింది. అందుకు ప్రతిగా 10 కండిషన్లు పెట్టింది. ఒక్క సీజ్‌ఫైర్‌తో సరిపెట్టుకునేది లేదని స్పష్టం చేసింది. హార్ముజ్‌పై తమ కంట్రోల్‌కు గుర్తింపు, ఆంక్షలు ఎత్తివేత, నష్టపరిహారం మొదలైనవి డిమాండ్లుగా పేర్కొంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
News April 6, 2026
3 మ్యాచుల్లో వివాదాలు.. బీసీసీఐకి SRH ఫిర్యాదు?

RCB, KKR, LSGతో మ్యాచుల సందర్భంగా జరిగిన పరిణామాలపై SRH బీసీసీఐకి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. క్లాసెన్ క్యాచ్‌ను సాల్ట్, అభిషేక్ క్యాచ్‌ను వరుణ్ బంతి నేలను తాకాక పట్టుకొన్నట్లు కనిపిస్తున్నా ఔటివ్వడంపై యాజమాన్యం అసంతృప్తిగా ఉంది. అలాగే నిన్న పంత్ కొట్టిన బాల్ బౌండరీ లైన్ దాటకముందే అవేశ్ బ్యాటుతో లోపలికి కొట్టారు. వీటిపై చర్యలు తీసుకోవాలని సన్ రైజర్స్ కోరనున్నట్లు <<19577513>>తెలుస్తోంది.<<>>


