News November 28, 2024

మా పాలనలో ఎన్నో అమలు చేశాం: జగన్

image

AP: ప్రతి గ్రామంలో సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి, లంచాలు, వివక్ష లేకుండా ప్రతి కుటుంబానికి పథకాలు అందించామని జగన్ చెప్పారు. ‘క్యాలెండర్ ఇచ్చి మరీ పథకాలు అమలు చేశాం. రూ.2.73 లక్షల కోట్లు అకౌంట్లలో జమ చేశాం. ప్రభుత్వ బడులతో ప్రైవేట్ బడులు పోటీ పడేలా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాం. ఆరోగ్య ఆసరా, మెడికల్ కాలేజీలు, RBK, ఉచిత పంటల బీమా వంటివి ఎన్నో మా హయాంలో తీసుకొచ్చాం’ అని ఆయన వెల్లడించారు.

Similar News

News November 28, 2024

గండికోట నాకు స్పెషల్: కేంద్ర మంత్రి పెమ్మసాని

image

AP: గండికోట ప్రాజెక్ట్ తనకు ఎంతో ప్రత్యేకమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తమ పూర్వీకులే ఈ కోటను పాలించారని ఆయన చెప్పారు. ‘గండికోట అభివృద్ధికి రూ.78 కోట్ల నిధులు విడుదల చేస్తున్నాం. ఈ నిధులతో ఇక్కడ అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తాం. గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా దీనిని తీర్చిదిద్దుతాం’ ఆయన వ్యాఖ్యానించారు.

News November 28, 2024

డిసెంబర్ 4న క్యాబినెట్ భేటీ

image

AP క్యాబినెట్ సమావేశం డిసెంబర్ 4వ తేదీన జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనుంది. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ, కొత్త పథకాలు, రేషన్‌కార్డులు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ సహా పలు అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.

News November 28, 2024

LOWEST RECORD: 42 పరుగులకే శ్రీలంక ఆలౌట్

image

సౌతాఫ్రికాతో తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో శ్రీలంక కేవలం 42 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కమిందు మెండిస్(13), లహిరు కుమార(10) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. లంకకు ఇదే అత్యల్ప స్కోరు. 2006లో PAK చేతిలో 73కు ఆలౌటైంది. SA బౌలర్లలో జాన్సెన్ 7 వికెట్లతో లంకేయులను ముప్పుతిప్పలు పెట్టారు. కొయెట్జీ 2, రబాడ 1 వికెట్ తీశారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో SA 191 రన్స్ చేసింది.