News December 13, 2024
పోలీసులకు ముందుగానే ఇన్ఫార్మ్ చేశాం: సంధ్య థియేటర్

పుష్ప-2 సినిమా ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ వస్తున్నారని ముందుగానే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశామని సంధ్య థియేటర్ యాజమాన్యం ఓ లేఖను షేర్ చేసింది. ‘4వ తేదీన రాత్రి 9.30 గంటలకు అల్లుఅర్జున్, హీరోయిన్, వీఐపీలు వస్తున్నారు. భారీగా ప్రజలు తరలివస్తారు. కాబట్టి పోలీసులు బందోబస్తు కల్పించండి’ అని చిక్కడపల్లి ఏసీపీకి లేఖను రాశారు.
Similar News
News November 11, 2025
ఆరుద్రలో అడ్డెడు చల్లినా పుట్టెడు పంట

ఆరుద్ర కార్తె (జూన్ 22 నుంచి జూలై 5 వరకు ఉండే సమయం) అనేది వర్షాకాలం ప్రారంభంలో వ్యవసాయ పనులకు సరైన సమయం. ఈ కార్తెలో భూమిలో తగినంత తేమ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అడ్డెడు( తక్కువ పరిమాణంలో) విత్తనాలు చల్లినా, అవి బాగా మొలకెత్తి పుట్టెడు(ఎక్కువ) పంటను ఇస్తాయని రైతుల విశ్వాసం. ఈ సామెత ఆరుద్ర కార్తెలో విత్తనాలు వేయడం, అప్పటి వర్షాలు.. పంటకు ఎంత అనుకూలంగా ఉంటాయో తెలియజేస్తుంది.
News November 11, 2025
హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి?

హనుమంతుని పూజతో భూతప్రేత పిశాచ భయాలు తొలగి, శని ప్రభావం వల్ల కలిగే బాధలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. హనుమాన్ చాలీసా పారాయణం వలన మంచి బుద్ధి, ధైర్యం, కీర్తి లభిస్తాయని నమ్మకం. ఆయనకు ఇష్టమైన అరటి, మామిడి పండ్లను నివేదించి, పూజించడం వల్ల చేపట్టిన కార్యాలు త్వరగా పూర్తై, మనసులోని కోరికలు నెరవేరుతాయట. ‘సంతానం కోసం ఎదురుచూసే దంపతులు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం’ ఉత్తమం అని పండితులు చెబుతున్నారు.
News November 11, 2025
శ్రద్ధ తీసుకోకనే అందెశ్రీ చనిపోయారు: వైద్యులు

TG: ప్రజా కవి అందెశ్రీ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోకపోవడం వల్లనే మరణించారని వైద్యులు తెలిపారు. నెల రోజులుగా బీపీ టాబ్లెట్స్ తీసుకోకపోవడం వల్లనే గుండెపోటు వచ్చిందని చెప్పారు. మూడు రోజుల నుంచి అనారోగ్యంగా ఉన్నా ఆసుపత్రికి వెళ్లలేదని తెలిపారు. కాగా ఆయన అంత్యక్రియలు ఇవాళ ఘట్కేసర్‌లోని ఎన్ఎఫ్‌సీ నగర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరై నివాళులర్పించనున్నారు.


