News March 21, 2024
ప్రతి రైతు పంటకు ఇన్సూరెన్స్ చేస్తాం: జూపల్లి

TG: నిజామాబాద్ జిల్లాలో ఇటీవల వడగళ్ల వానలకు దెబ్బతిన్న పంటలను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. రైతులు అధైర్యపడొద్దని, దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10వేల పరిహారం అందజేస్తామన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ ఏనాడూ రైతులను ఆదుకోలేదని విమర్శించారు. వచ్చే పంట కాలానికి ప్రతి రైతు పంటకు ఇన్సూరెన్స్ చేస్తామని వెల్లడించారు. అన్నదాతలను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ అని మంత్రి పునరుద్ఘాటించారు.
Similar News
News September 13, 2025
అహంకారం వినాశనానికి కారణం

రావణుడు విద్యావంతుడు, గొప్ప పండితుడు, శివ భక్తుడు. ఆయనకు పాలనలోనూ మంచి పరిజ్ఞానం ఉంది. అయితే, అహంకారం, దుర్గుణాలు ఆయన పతనానికి కారణమయ్యాయి. ధర్మం బోధించిన భార్య మండోదరి మాటలను సైతం రావణుడు పెడచెవిన పెట్టాడు. తన అహంకారం కారణంగా సీతను అపహరించి, చివరకు తన సామ్రాజ్యాన్ని కోల్పోయి, నాశనమయ్యాడు. ఎంత గొప్ప వ్యక్తికైనా దుర్గుణాలు, అహంకారం అపారమైన నష్టాన్ని కలిగిస్తాయని రావణుడి జీవితం తెలియజేస్తోంది.
News September 13, 2025
మీకు ‘చిన్న తిరుపతి’ తెలుసా?

AP: ఏలూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ‘ద్వారకా తిరుమల’. ఇక్కడ స్వామివారు వెంకన్న రూపంలో కొలువై ఉన్నారు. ఇది ‘చిన్న తిరుపతి’గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామిని దర్శించుకుంటే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నంత పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో రెండు విగ్రహాలు ఉంటాయి. ఒకటి సంతానానికి, మరొకటి పెళ్లి సంబంధాలకు ప్రతీకగా భావిస్తారు. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిశారని చెబుతారు.
News September 13, 2025
పశువుల్లో గాలికుంటు వ్యాధి ఎలా వస్తుందంటే?

వైరస్ ద్వారా వ్యాపించే గాలి కుంటువ్యాధి పశువుల్లో ప్రమాదకరమైనది. వర్షాకాలంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తడిగా ఉండే నేలపై గడ్డిమేయడం, కలుషితమైన మేత, దాణా తినడం వల్ల ఈ వైరస్ పశువులకు సోకుతుంది. ఇది అంటువ్యాధి. వైరస్, గాలి ద్వారా ఇతర పశువులకూ వ్యాపిస్తుంది. తల్లిపాల ద్వారా దూడలకు వస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ వ్యాధి పశువులకు వచ్చే అవకాశం ఎక్కువ.