News February 7, 2025
కులగణనపై సభకు రాహుల్‌ను ఆహ్వానించాం: భట్టి
తెలంగాణలో అమలవుతున్న పథకాలను కాంగ్రెస్ అధిష్ఠానానికి వివరించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఢిల్లీలో భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. కులగణన వివరాలను కేసీకి అందించామన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై త్వరలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నామని, వీటికి రాహుల్ గాంధీని ఆహ్వానించామని చెప్పారు.
Similar News
News February 7, 2025
మే, జూన్ నెలల్లో 2 పథకాల అమలు: మంత్రి కొలుసు
AP: తాము అధికారంలోకి వచ్చాక ఉచిత సిలిండర్లు, అన్న క్యాంటీన్లు అమలు చేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. తల్లికి వందనం(విద్యార్థికి ₹15K), అన్నదాత సుఖీభవ(రైతుకు ₹20K) పథకాలను మే, జూన్ నెలల్లో అమలు చేస్తామని ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం ప్రారంభిస్తామని CM CBN సైతం వెల్లడించారు. అన్నదాత సుఖీభవను 3 విడతలుగా అందిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
News February 7, 2025
గాజా స్వాధీనంపై ట్రంప్‌ది గొప్ప ఆలోచన: నెతన్యాహు
గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన <<15364652>>వ్యాఖ్యలను<<>> ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమర్థించారు. ఆయన చేసిన ప్రతిపాదనలో తప్పు లేదని, గొప్ప ఆలోచన అని చెప్పారు. నిజంగా అది అమల్లోకి వస్తే గాజా ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. కాగా గాజా నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని ట్రంప్ చేసిన ప్రతిపాదనను అరబ్ దేశాలు ఖండించిన విషయం తెలిసిందే.
News February 7, 2025
సోనూసూద్ అరెస్ట్‌కు వారెంట్
నటుడు సోనూసూద్‌కు లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అతడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ముంబై పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. మోహిత్ అనే వ్యక్తి ‘రిజికా కాయిన్’లో పెట్టుబడి పేరుతో ₹10L మోసం చేశాడని, దీనికి సోనూసూద్ సాక్షి అని పేర్కొంటూ రాజేశ్ అనే లాయర్ కేసు వేశారు. కోర్టు పంపిన సమన్లకు సోనూసూద్ స్పందించకపోవడంతో జడ్జి తీవ్రంగా స్పందించారు.