News March 22, 2024

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏలో చేరాం: చంద్రబాబు

image

AP: రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక అజెండాగా ఎన్డీఏలో చేరామని టీడీపీ అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రజాభిప్రాయం మేరకు రాష్ట్ర సమస్యలపై పోరాడే నేతలనే అభ్యర్థులుగా నిలబెడుతున్నామని చెప్పారు. వారిని ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. ఇప్పటి వరకు 139 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని, మిగిలిన 5 MLA, 4 MP స్థానాలకు క్యాండిడేట్లను త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపారు.

Similar News

News October 2, 2024

‘ఆరోగ్యమే మహాభాగ్యం’.. గాంధీ ఆరోగ్య రహస్యాలివే!

image

గాంధీజీ ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. రోజువారీ ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకునేవారు. ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే దంపుడు బియ్యాన్ని మాత్రమే తినేవారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలనే ఇష్టపడేవారు. చక్కెరను పక్కనబెట్టి బెల్లం టీ తాగేవారు. రోజూ 15 కి.మీ నడవడంతో పాటు ప్రాణాయామం, వ్యాయామాలు చేసేవారు. ధూమపానం, మద్యపానం, మాంసాహారానికి బాపూజీ దూరం.

News October 2, 2024

ఇజ్రాయెల్‌కు అమెరికా సపోర్ట్.. కారణాలివే!

image

చాలా ఏళ్లుగా ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా ఉంటోంది. 1948లో తొలిసారిగా ఇజ్రాయెల్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించింది అమెరికానే. 1967లో పశ్చిమాసియాపై రష్యా ఆధిపత్యం పెరిగిపోకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంది. దీంతో అమెరికా దృష్టిని ఇజ్రాయెల్ ఆకర్షించింది. మిడిల్ ఈస్ట్‌పై పట్టుకు ఇజ్రాయెల్ తమకు ఉపయోగపడుతుందని స్నేహబంధం కొనసాగిస్తూ వస్తోంది. అలాగే అమెరికాలో యూధులు రాజకీయంగా చాలా ప్రభావం చూపగలరు.

News October 2, 2024

న్యూజిలాండ్ కెప్టెన్‌గా టామ్ లాథమ్

image

న్యూజిలాండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ తప్పుకున్నారు. అతని స్థానంలో బ్యాటర్ టామ్ లాథమ్ కెప్టెన్‌గా నియామకం అయ్యారు. అక్టోబర్ 16 నుంచి INDతో జరిగే 3 మ్యాచుల టెస్ట్ సిరీస్ నుంచి లాథమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. IND, NZ మధ్య OCT 16 నుంచి బెంగళూరులో తొలి టెస్ట్, 24 నుంచి పుణేలో రెండో టెస్ట్, నవంబర్ 1 నుంచి ముంబైలో మూడో టెస్ట్ జరగనుంది.