News April 6, 2024
తెలంగాణలో మాట నిలబెట్టుకున్నాం: రాహుల్

తాము అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలను నెరవేరుస్తున్నామని రాహుల్ గాంధీ తెలిపారు. ‘దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న తరుణంలో తెలంగాణలో ఇప్పటికే 30వేల ఉద్యోగాలు ఇచ్చాం. మరో 50వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. తెలంగాణలో మాట ఇచ్చి నిలబెట్టుకున్నట్లే జాతీయ స్థాయిలో మాట నిలబెట్టుకుంటాం’ అని తుక్కుగూడ సభలో హామీ ఇచ్చారు.
Similar News
News April 10, 2026
డిజిటల్ సెన్సస్: 5.72లక్షల ఫ్యామిలీలు నమోదు

దేశ వ్యాప్తంగా ‘Census2027’ డిజిటల్ నమోదు ప్రక్రియ ఊపందుకుంది. మొదటి దశలో భాగంగా ఎంపిక చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ‘స్వీయ గణన’ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు 5.72 లక్షలకు పైగా కుటుంబాలు ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్నాయి. కాగా త్వరలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ స్వీయ గణన ప్రక్రియ ప్రారంభంకానుంది. దీనిద్వారా ఎవరికివారు ఆన్‌లైన్‌లో తమ వివరాలు నమోదు చేయవచ్చు.
News April 10, 2026
శాంతి చర్చల వేళ.. పాక్vsఇజ్రాయెల్

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల వేళ పాక్, ఇజ్రాయెల్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ దుష్ట, క్యాన్సర్ దేశమని పాక్ రక్షణ మంత్రి ఖవాజా విమర్శించారు. గాజా, లెబనాన్‌లో మారణ హోమం చేస్తోన్న ఆ దేశాన్ని నాశనం చేయాలన్నారు. ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ఘాటుగా స్పందించింది. మీడియేటర్‌గా ఇలాంటి కామెంట్లు దారుణమంది. ఉగ్రవాదుల నుంచి ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకుంటుందని పేర్కొంది.
News April 10, 2026
కాసేపట్లో క్యాబినెట్ భేటీ.. అమరావతిపై కీలక చర్చ

AP: సీఎం CBN అధ్యక్షతన ఈ ఉదయం 10.30గంటలకు క్యాబినెట్ భేటీ కానుంది. ముందుగా అమరావతి చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి క్యాబినెట్ ధన్యవాదాలు తెలపనుంది. ఆపై రాజధానిలో నిర్మాణాలపై చర్చ జరగనుంది. 16వ SIPB సమావేశంలో చర్చించిన ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. అలాగే రాష్ట్రంలో 28 జిల్లాల ఆధారంగా జోనల్ వ్యవస్థను ఖరారు చేసే అంశంపైనా చర్చ జరగనుంది.


