News August 10, 2025

‘బనకచర్ల’ను ఎలా ఆపాలో మాకు తెలుసు: భట్టి

image

TG: కాంగ్రెస్ పాలనలో రివేంజ్ పాలిటిక్స్‌కు తావులేదని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ‘కాళేశ్వరంపై నివేదికను మేం మార్చామన్నది అవాస్తవం. పెన్షన్ల పెంపు తప్పా 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం. ఉద్యోగాలపై మాట నిలబెట్టుకున్నాం. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు తొలుత కంటే ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారు. బనకచర్లపై AP మంత్రి లోకేశ్ వ్యాఖ్యలు సరికాదు. ఆ ప్రాజెక్టును ఎలా ఆపాలో మాకు తెలుసు’ అని స్పష్టం చేశారు.

Similar News

News August 11, 2025

శుభ సమయం (11-08-2025) సోమవారం

image

✒ తిథి: బహుళ విదియ మ.11.42 వరకు
✒ నక్షత్రం: శతభిషం మ.2.58 వరకు
✒ శుభ సమయం: ఉ.6.40-7.16, రా.7.52-8.16
✒ రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00
✒ యమగండం: మ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12, మ.2.46-3.34
✒ వర్జ్యం: రా.9.13-రా.10.46
✒ అమృత ఘడియలు: ఉ.7.56-ఉ.9.29

News August 11, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* బెంగళూరులో 3 వందేభారత్ రైళ్లు ప్రారంభించిన మోదీ
* TG: హైదరాబాద్ బస్తీల్లో పర్యటించిన సీఎం రేవంత్
* అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లు: భట్టి
* తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడతాం: ఉత్తమ్
* AP: డోలి రహిత గిరిజన గ్రామాలే లక్ష్యం: పవన్ కళ్యాణ్
* చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారు: జగన్
* రేపు పీఎం ఫసల్ బీమా యోజన నిధులు విడుదల

News August 11, 2025

భారత డ్యామ్‌ను మిస్సైళ్లతో పేల్చేస్తాం: పాక్ ఆర్మీ చీఫ్

image

US గడ్డపై నుంచి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత్‌కు హెచ్చరికలు చేశారు. ‘భవిష్యత్తులో తమ దేశానికి భారత్‌తో ముప్పు ఉందని తెలిస్తే సగం ప్రపంచాన్ని మాతో పాటు ధ్వంసం చేస్తాం. సింధూ నదిపై భారత్ డ్యామ్ కట్టే వరకు ఆగి 10 మిస్సైళ్లతో పేల్చేస్తాం. సింధూ నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదు. మాదీ అణ్వాయుధ దేశమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మా వద్ద మిస్సైళ్లకు కొదవ లేదు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.