News January 4, 2025
మేం ఇచ్చిన హామీలు మాకు తెలుసు: మంత్రి పయ్యావుల
AP: తాము ఇచ్చిన హామీలు తమకు తెలుసని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దీనిపై మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన విమర్శించారు. ‘వైసీపీ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. దేశంలోని మరే రాష్ట్రానికి ఇన్ని అప్పులు లేవు. కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి రోజు నుంచే ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి వెళ్లిపోయారు’ అని ఆయన ధ్వజమెత్తారు.
Similar News
News January 6, 2025
BREAKING: మరో రెండు hMPV కేసులు
దేశంలో మరో రెండు hMPV కేసులు వెలుగుచూశాయి. చెన్నైలో ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకినట్లు తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఆరుకు చేరింది.
News January 6, 2025
హీరో విశాల్ ఆరోగ్యంపై అపోలో డాక్టర్ల అప్డేట్
<<15074772>>హీరో విశాల్<<>> ఆరోగ్యంపై చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు స్పందించారు. ‘ప్రస్తుతం విశాల్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఆయనకు చికిత్స అందిస్తున్నాం. విశాల్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఓ లెటర్ రిలీజ్ చేశారు. కాగా ‘మదగజరాజ’ ఈవెంట్లో విశాల్ వణుకుతూ, సరిగ్గా నడవలేకుండా కనిపించారు. పూర్తిగా సన్నబడిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
News January 6, 2025
కుంభమేళాపై దాడి చేస్తాం: గురుపత్వంత్ పన్నూ
Jan 13 నుంచి ప్రయాగ్రాజ్లో ప్రారంభమయ్యే కుంభమేళాపై దాడి చేస్తామని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. హిందూత్వ సిద్ధాంతాల్ని అంతం చేయడానికి తరలిరావాలంటూ మద్దతుదారులకు పిలుపునిచ్చాడు. లక్నో, ప్రయాగ్రాజ్ విమానాశ్రయాల్లో ఖలిస్థానీ, కశ్మీర్ జెండాలను ఎగరేయాలని, కుంభమేళా-2025 యుద్ధభూమిగా మారుతుందని చెప్పుకొచ్చాడు. పన్నూ గతంలోనూ ఇలాంటి హెచ్చరికలు చేశాడు.