News May 14, 2024

పంత్‌ లేకపోవడం వల్లనే ఓడిపోయాం: గంగూలీ

image

ఆర్సీబీతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తమ బ్యాటింగ్ ఆర్డర్‌లో పంత్ చాలా కీలకమని ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ గంగూలీ పేర్కొన్నారు. అతడు లేకపోవడం ఓటమికి ప్రధాన కారణమని చెప్పారు. ఇక.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు మంచి అవకాశాలే ఉన్నాయని ఆయన అంచనా వేశారు. రోహిత్ శర్మ ఫామ్ గురించి ఆందోళన అక్కర్లేదని, పెద్ద టోర్నమెంట్లలో శర్మ రాణిస్తారని గంగూలీ ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News March 4, 2026

NATO దేశమైన తుర్కియేపైకి ఇరాన్ మిస్సైల్

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం మరిన్ని దేశాలకు పాకే అవకాశం ఉంది. NATO సభ్య దేశమైన తుర్కియేపైకి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని ఫైర్ చేసింది. ఇరాక్, సిరియా దేశాలపై నుంచి ఈ మిస్సైల్ దూసుకొచ్చిందని, దాన్ని NATO ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకుందని తుర్కియే మంత్రి వెల్లడించారు. సిరియా సరిహద్దుల్లో శకలాలు పడ్డాయన్నారు. కాగా NATO దేశంపై దాడి జరిగితే మిగతా సభ్య దేశాలూ రంగంలోకి దిగాలనే నిబంధన ఉంది.

News March 4, 2026

శ్రీవారి పేరు ఉచ్చరించే నైతికత నీకుందా జగన్: బీఆర్ నాయుడు

image

AP: హిందుత్వం గురించి మాట్లాడే అర్హత <<19295165>>జగన్‌కు<<>> లేదని టీటీడీ ఛైర్మన్ BR నాయుడు విమర్శించారు. శ్రీవారి పేరు ఉచ్చరించే నైతికత ఆయనకు లేదని ఫైరయ్యారు. ‘హిందూ వ్యతిరేకి అయిన నువ్వు CMగా ఉన్నావనే వైవీ, భూమన హిందూ మత ఔన్నత్యాన్ని మంటగలిపారు. నేను ఛైర్మన్ అయ్యాక TTDని ప్రక్షాళన చేస్తున్నా. అందుకే నాపై ఫేక్ వీడియోలతో తిరుమల ప్రతిష్ఠ దెబ్బతీయాలని చూశావు’ అని మండిపడ్డారు.

News March 4, 2026

భయం పుట్టించే B-2 తయారీలో ఇండో-అమెరికన్!

image

ప్రపంచంలో భయంకరమైన యుద్ధ ఆయుధాల్లో <<19277612>>B-2<<>> బాంబర్ టాప్‌లో ఉంటుంది. దీని తయారీలో భారత సంతతికి చెందిన నోషిర్ గొవాడియాది కీలకపాత్ర. 1944లో బాంబేలో జన్మించిన ఈయన USకు వెళ్లి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు. నార్త్‌రోప్ గ్రుమ్మన్ కంపెనీలో డిజైన్ ఇంజినీర్‌గా చేరారు. B-2 బాంబర్లు శత్రువుల రాడార్లకు కనబడకుండా స్పెషల్ డిజైన్ చేశారు. చైనాకు దీని సమాచారం ఇచ్చారని US కోర్టు 2010లో 32 ఏళ్ల జైలుశిక్ష విధించింది.