News March 11, 2025
రోహిత్ వల్లే ఓడిపోయాం: శాంట్నర్

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఓడిపోవడంపై NZ కెప్టెన్ శాంట్నర్ స్పందించారు. బ్యాటింగ్‌లో 20రన్స్ తక్కువగా చేశామని, ఆపై రోహిత్ అసాధారణ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారని తెలిపారు. హిట్‌మ్యాన్ బ్యాటింగే రెండు టీమ్‌ల మధ్య తేడా అన్నారు. బలమైన జట్టు చేతిలోనే ఓడిపోయామని వివరించారు. తమ జట్టు మంచి క్రికెట్ ఆడి INDకు గట్టి పోటీ ఇచ్చిందని చెప్పారు. ఈ ఓటమి చేదు, తీపితో కూడుకున్నదని తెలిపారు.
Similar News
News March 6, 2026
TODAY HEADLINES

* ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదు: PM
* BJP చేతికి బిహార్ పగ్గాలు.. RSకు నితీశ్
* WB గవర్నర్ బోస్, లద్దాక్ LG కవీందర్ రిజైన్
* ఇద్దరు, ఆపై సంతానానికి రూ.25,000: CBN
* జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వబోం: అయ్యన్న
* కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు: పవన్
* TG: రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ నామినేషన్
* TG: HYDలో రేవంత్ ఒక్క ఇల్లూ కట్టలేదు: KTR
* T20WC.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
News March 6, 2026
తెలంగాణ కొత్త గవర్నర్ శుక్లా నేపథ్యం ఇదే

తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ఈయన 1952లో గోరఖ్‌పూర్(UP)లో జన్మించారు. 1983లో BJPలో చేరారు. 1989, 91, 93, 96లో గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2016-2022 వరకు ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2017-19 వరకు నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో ఆర్థికశాఖ సహాయమంత్రిగా పని చేశారు. 2023 నుంచి ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు.
News March 6, 2026
యుద్ధం ఎఫెక్ట్.. పడిపోయిన కోడి గుడ్ల ధర!

అమెరికా-ఇజ్రాయెల్vsఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం మన దేశంలోని పౌల్ట్రీ రంగంపైనా పడింది. రోజుకు రూ.5 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో కోడి గుడ్ల నిల్వలు పెరిగి ధరలు దారుణంగా పడిపోయాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఒక్కో గుడ్డు ధరను రూ.4.30గా నిర్ణయించగా, స్థానిక మార్కెట్లలో రూ.3.50 పలుకుతోంది. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది.


