News April 5, 2024

1.8% ఓట్ల తేడాతోనే ఓడిపోయాం: KCR

image

TG: తాము కేవలం 1.8% ఓట్ల తేడాతోనే ఓడిపోయామని కేసీఆర్ అన్నారు. ‘మాకు 38%, మీకు 39.8% ఓట్లు పోలయ్యాయి. మేం ఔట్ కాలేదు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25 వేలు పరిహారం ఇవ్వాలి. ప్రతి పంటకు రూ.500 బోనస్ ప్రకటించాలి. ఇవ్వకపోతే మిమ్మల్ని గద్దలెక్క వెంటాడుతా. వదిలిపెట్టను. రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు’ అని కేసీఆర్ హెచ్చరించారు.

Similar News

News March 31, 2026

253వ సారి పోటీకి దిగిన ‘ఎలక్షన్ కింగ్’

image

ఎలక్షన్ కింగ్‌గా పేరొందిన పద్మరాజన్(65) TNలోని మెట్టూరు నుంచి 253వ సారి నామినేషన్ వేశారు. ఈయన 1988 నుంచి దేశంలో జరిగే అన్ని ఎన్నికల్లోనూ బరిలో నిలుస్తున్నారు. PV, వాజ్‌పేయీ, మోదీ, మన్మోహన్, కరుణానిధి, జయలలిత, స్టాలిన్, పళనిస్వామి వంటి ప్రముఖులపైనా పోటీకి దిగారు. ఇప్పటివరకు డిపాజిట్లకే రూ.కోటికి పైగా ఖర్చు చేయడం గమనార్హం. సామాన్యులు ఎవరితోనైనా పోటీ పడొచ్చని చెప్పడమే తన ఉద్దేశమని ఆయన చెబుతుంటారు.

News March 31, 2026

కింగ్ వందో చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు?

image

రా.కార్తీక్ డైరెక్షన్‌లో నాగార్జున నటిస్తున్న వందో చిత్రం(KING100)లో ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్లు సమాచారం. 1998లో వచ్చిన ‘ఆవిడా మా ఆవిడే’ తర్వాత కింగ్, టబు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఐశ్వర్యా రాజేశ్, సుస్మితా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాక్. ఈ చిత్రంలో నాగ్ డబుల్ రోల్ చేస్తున్నారని, ఇప్పటికే మైసూర్‌లో కీలక షెడ్యూల్స్ పూర్తయినట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.

News March 31, 2026

రేపటి నుంచి జరిగే మార్పులివే!

image

☛ ఇకపై OTPతో డిజిటల్ చెల్లింపులు చేయలేం. ప్రతి ట్రాన్సాక్షన్‌కి PIN/Password, రిజిస్టర్డ్ డివైజ్, ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీ వంటివి ఏవైనా 2 కావాలి.
☛ దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్‌ తప్పనిసరి.
☛ KYC చేయని ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్లు బ్లాక్ అవుతాయి.
☛ కొన్ని బ్యాంకులు డెబిట్ కార్డు నిర్వహణ ఛార్జీలను పెంచాయి.
☛ ఇక నుంచి అన్ని కొత్త బీమా పాలసీలను తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ రూపంలోనే జారీ చేయాలి.