News April 8, 2024

రూ.1,000 పెన్షన్‌ను రూ.3,000 చేశాం: CM జగన్

image

AP: కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ‘వాలంటీర్లను నియమించి ఇంటింటికీ పెన్షన్లు అందించాం. 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు పెన్షన్ రూ.1,000 ఉండేది. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.3,000 పెన్షన్ ఇస్తున్నాం. గతంలో 29 లక్షల మందికి పెన్షన్ ఇస్తే మేం 66 లక్షల మందికి ఇస్తున్నాం. ప్రతి అవ్వాతాత దీని గురించి ఆలోచించాలి’ అని కోరారు.

Similar News

News April 9, 2026

పాలిసెట్.. మరికొన్ని గంటలే ఛాన్స్

image

AP: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2026-27 సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే <<19588593>>పాలిసెట్<<>> దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇప్పటివరకు అప్లై చేసుకోని విద్యార్థులు ఈ రాత్రిలోగా చేసుకోవాలని అధికారులు సూచించారు. టెన్త్ పాసైనవారు, ఇటీవల పరీక్ష రాసిన వారు అర్హులని తెలిపారు. ఏప్రిల్ 25న పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 9, 2026

IPL: నేడు LSGvsKKR.. గెలిచేదెవరు?

image

ఈరోజు కోల్‌కతా వేదికగా LSG, KKR 7.30PMకి తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు LSG రెండు మ్యాచులు ఆడి ఒక దాంట్లో గెలిచింది. అటు బౌలింగ్‌లో తడబడుతున్న KKR ఇంకా బోణీ కొట్టలేదు. 3 మ్యాచుల్లో 2 ఓడింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. గత మ్యాచుకు దూరమైన నరైన్ ఈరోజు ఆడే అవకాశముంది. గాయపడ్డ వరుణ్ ఆడతారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. కాగా నేటి మ్యాచుకు వర్షం అంతరాయం కలిగించకపోవచ్చని CricBuzz పేర్కొంది.

News April 9, 2026

కఠినాత్ముల మనస్సు కరిగించలేం!

image

వంపుకర్రగాచి వంపు తీర్చగవచ్చు
కొండలన్ని పిండిగొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింపగా రాదు
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: వంపుగా ఉన్న కర్రను వేడి చేసి తిన్నగా చేయవచ్చు. కొండలను కూడా పిండి చేయవచ్చు. కానీ మొండి పట్టుదల లేదా కఠినాత్ముల మనస్సును కరిగించడం సాధ్యం కాదు.
<<-se>>#PADHYAM<<>>