News November 11, 2024

స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేశాం.. దేనికీ భ‌య‌ప‌డం: ఖ‌ర్గే

image

స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేశామ‌ని, అలాంటిది ED, CBI దాడుల‌కు భ‌య‌ప‌డ‌బోమ‌ని కాంగ్రెస్‌ అధ్య‌క్షుడు ఖ‌ర్గే స్ప‌ష్టం చేశారు. మోదీ ఆదేశానుసారంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. ‘విడిపోతే తుడిచిపెట్టుకుపోతాం’ అని యోగీ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ నిజ‌మైన యోగీ ఎవ‌రూ ఇలా మాట్లాడ‌ర‌న్నారు. రాజీవ్ హ‌ంత‌కులను సోనియా, ప్రియాంక క్షమించారని, కరుణ అంటే ఇదే అన్నారు.

Similar News

News November 8, 2025

పెట్టుబడుల సదస్సుకు భారీ ఏర్పాట్లు

image

AP: విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే పెట్టుబడుల సదస్సు కోసం శరవేగంగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. AU ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండులో 8 హాళ్లను సిద్ధం చేస్తున్నారు. సమ్మిట్ ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరుకానున్నారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు 33 దేశాల వాణిజ్య మంత్రులు పాల్గొంటారు. ప్రాంగణంలో 1,600 మంది ప్రముఖులు కూర్చునేలా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.

News November 8, 2025

ప్రీటెర్మ్ బర్త్‌కు ఇదే కారణం

image

గర్భధారణ తర్వాత తొమ్మిది నెలలు నిండాక బిడ్డకు జన్మనివ్వడం సాధారణం. కానీ మరికొందరిలో నెలలు నిండక ముందే ప్రసవం జరుగుతుంది. దీన్నే ప్రీటెర్మ్ బర్త్ అని కూడా అంటారు. ఇలా నెలల నిండకుండానే డెలివరీ కాకపోవడానికి పోషకాహార లోపం, రక్తహీనత, మానసిక సమస్యలే ముఖ్య కారణమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇలా ఎక్కువగా స్ట్రెస్ కాకుండా ప్రశాంతంగా ఉంటూ పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News November 8, 2025

ఈరోజు మీకు సెలవు ఉందా?

image

AP: మొంథా తుఫాను సమయంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి రెండో శనివారం పాఠశాలలు నిర్వహించాలని DEOలు ఆదేశాలు ఇచ్చారు. దీంతో నేడు విశాఖ, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో స్కూళ్లకు సెలవు రద్దు చేశారు. కర్నూలు, నంద్యాల, NTR, కడప, ప.గో, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లోనూ పాఠశాలలకు సెలవు రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరి మీ ప్రాంతంలో స్కూల్ ఉందా? COMMENT