News July 9, 2024
‘మాకు ₹30వేల కోట్లు కావాలి’.. బిహార్ డిమాండ్‌తో కేంద్రంపై భారం!
బిహార్‌లో ప్రాజెక్టుల అభివృద్ధికి బడ్జెట్‌లో ₹30వేల కోట్లు కేటాయించాలని జేడీయూ సర్కార్ కేంద్రాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలతో జరిగిన ప్రీబడ్జెట్ మీటింగ్‌లో ఈ డిమాండ్ లేవనెత్తినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా మరో మిత్రపక్షమైన టీడీపీ సైతం ఇప్పటికే ₹లక్షకోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో NDA సర్కార్‌కు ఈ బడ్జెట్ రూపకల్పన సవాల్‌గా మారింది.
Similar News
News January 18, 2025
లవ్ యూ మిషెల్.. ఒబామా ట్వీట్
తన భార్య మిషెల్ ఒబామాతో విడాకులు తీసుకుంటున్నారని వస్తోన్న వార్తలకు అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చెక్ పెట్టారు. ఆమె బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే మై లవ్. మీరు నా జీవితంలో హాస్యం, ప్రేమ, దయతో నింపావు. నీతో కలిసి జీవితంలో ఎన్నో సాహసాలు చేయగలిగినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. లవ్ యూ’ అని తెలిపారు.
News January 18, 2025
తిరుమలలో అపచారం
కలియుగ దైవం కొలువైన తిరుమల కొండపై అపచారం జరిగింది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు కొండపైకి కోడిగుడ్డు పలావ్ తీసుకొచ్చారు. రాంభగీచ బస్టాప్ వద్ద వారు ఈ నిషేధిత ఆహారపదార్థాలు తింటుండగా భక్తులు చూసి అధికారులకు ఫిర్యాదు చేశారు. తిరుమల నియమాలు తమకు తెలియదని వారు చెప్పారు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. అలిపిరి వద్ద తనిఖీ సిబ్బంది డొల్లతనం వల్లే ఇలా జరిగిందని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News January 18, 2025
GOOD NEWS: ఉచితంగా ప్లాట్లు
AP: ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి <<15179066>>ఇళ్ల స్థలాలు<<>> ఇస్తామని నిన్న ప్రకటించింది. ఇవి ఉచితమా? డబ్బు చెల్లించాలా? అనే సందేహాలు ఉన్నాయి. అయితే ఈ ప్లాట్లు పూర్తి ఉచితంగా ఇస్తారు. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున కేటాయిస్తారు. కేంద్ర పథకాలతో ఈ కాలనీల్లో మౌలిక వసతులు మెరుగుపరచనున్నారు. గతంలో ప్లాట్లు పొంది ఇళ్లు నిర్మించుకోని వారికి వాటిని రద్దు చేసి కొత్త ప్లాట్లు ఇస్తారు.