News September 10, 2025

మాగంటి ఫ్యామిలీకి అండగా నిలవాలి: కేటీఆర్

image

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీకి అందరూ అండగా నిలవాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఓ సర్వే ప్రకారం ఇక్కడ మనదే లీడ్ అని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశంలో మాట్లాడారు. ‘కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఆ పార్టీకి ఓటేస్తే మీ ఇల్లు మీరు కూల్చుకున్నట్లే’ అని వ్యాఖ్యానించారు. BRS అభ్యర్థిగా గోపీనాథ్ భార్య సునీత పేరు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది.

Similar News

News September 10, 2025

రామరాజ్యం లాంటి పాలన ఇస్తాం: CM

image

AP: రాష్ట్ర ప్రజలకు రామరాజ్యం లాంటి పాలన అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘నేను, పవన్ కళ్యాణ్, మాధవ్ కలిసి సుపరిపాలన అందిస్తాం. నేను నాలుగో సారి సీఎంను. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్. ఎమ్మెల్యేలందరూ కామన్ మ్యాన్‌లాగే ఉండాలి. దర్జాలు, ఆర్భాటాలు పనికిరావు. ఎవరూ అహంకారాన్ని ప్రదర్శించవద్దు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టే పనులు వేగంగా అవుతున్నాయి’ అని అనంతపురంలో వివరించారు.

News September 10, 2025

సూపర్-6 అట్టర్ ఫ్లాప్: వైసీపీ

image

AP: దీపం పథకం కింద ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితమంటూ ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైసీపీ విమర్శించింది. మొదటి ఏడాది ఒక సిలిండర్ ఇచ్చి మమ అనిపించిందని, మిగతావి ఇప్పటి వరకు అతీగతీ లేవని దుయ్యబట్టింది. ఇప్పుడు ఆ పథకం ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదని ఎద్దేవా చేసింది. ప్రజలను మోసగించి విజయోత్సవాలు చేసుకునేందుకు సిగ్గుండాలని మండిపడింది.

News September 10, 2025

వారసుడితో నాగబాబు ఫ్యామిలీ

image

వరుణ్-లావణ్య జోడీ మగబిడ్డకు జన్మనివ్వడంతో నాగబాబు కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. మనవడి రాకతో తమ కుటుంబ భవిష్యత్తుకు సరికొత్త కాంతి వచ్చిందని నాగబాబు ట్వీట్ చేశారు. ‘సింహం కూనకు స్వాగతం. నీవు నా హృదయంలో గర్జించావు. నీ చేతిని పట్టుకొని నడిచేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని రాసుకొచ్చారు. కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు.