News November 21, 2024
రూ.3,767 కోట్లతో ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టాం: జగన్
AP: మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా వారికి మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు చెప్పారు. గంగపుత్రుల సంక్షేమం కోసం తాము అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ‘మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరచడానికి ₹3,767crతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వేట నిషేధ సమయంలో 1.23 లక్షల కుటుంబాలకు ₹10k చొప్పున సాయం చేశాం. సబ్సిడీపై డీజిల్ అందించాం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 21, 2024
BREAKING: అదానీకి కెన్యా భారీ షాక్
అదానీ గ్రూప్‌తో కుదుర్చుకున్న రెండు భారీ ప్రాజెక్టులను రద్దు చేస్తున్నట్లు కెన్యా ప్రకటించింది. పవర్ ట్రాన్స్‌మిషన్ లైన్స్ నిర్మించేందుకు 700 మిలియన్ డాలర్ల ఎనర్జీ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు విలియం రుతో వెల్లడించారు. దాంతో పాటు JKI విమానాశ్రయాన్ని విస్తరించేందుకు జరుపుతున్న ప్రణాళికలను నిలిపివేస్తున్నామన్నారు. కాగా అదానీపై అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే.
News November 21, 2024
కొడుకు కాపురంపై స్పందించిన అమితాబ్
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ వైవాహిక జీవితం సరిగా లేదంటూ వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. వాటిపై అమితాబ్ బచ్చన్ తన బ్లాగులో పరోక్షంగా స్పందించారు. ‘ఊహాగానాలెప్పుడూ ఊహాగానాలే. అవాస్తవాలే. వాటికి ఎటువంటి ఆధారాలు ఉండవు. ధ్రువీకరణ కాని సమాచారాన్ని ప్రశ్నార్థకం పెట్టి రాసేస్తుంటారు. అది ఎవరి గురించైతే రాశారో వారి జీవితంపై ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో పట్టించుకోరు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
News November 21, 2024
కాల్పులు.. 38 మంది మృతి
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో దారుణం జరిగింది. ముష్కరులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 38 మంది మరణించారు. 29 మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. పరాచినార్ నుంచి పెషావర్‌కు వెళ్తున్న రెండు వ్యాన్లపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు.