News March 1, 2025
మాకు శాశ్వత శాంతి కావాలి: జెలెన్‌స్కీ

వైట్‌హౌస్‌లో US అధ్యక్షుడు ట్రంప్‌తో వాగ్వాదం అనంతరం భేటీ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్వీట్ చేశారు. ‘థాంక్యూ US. మీ మద్దతుకు కృతజ్ఞతలు. థాంక్యూ ప్రెసిడెంట్. ఉక్రెయిన్‌కు శాశ్వత శాంతి కావాలి. మేం అందుకోసమే పనిచేస్తున్నాం’ అని రాసుకొచ్చారు. కాగా రష్యాతో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలనుకోవడం లేదని, జెలెన్‌స్కీ శాంతిని కోరుకోవడం లేదని అంతకుముందు ట్రంప్ ఆరోపించారు.
Similar News
News November 4, 2025
స్పోర్ట్స్ రౌండప్

✒ మోకాలి గాయంతో బిగ్‌బాష్ లీగ్ సీజన్-15కు అశ్విన్ దూరం
✒ రంజీ ట్రోఫీ: రాజస్థాన్‌పై 156 రన్స్ చేసిన ముంబై బ్యాటర్ యశస్వీ జైస్వాల్
✒ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్: IND-A కెప్టెన్‌గా జితేశ్ శర్మ, జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు
✒ ICC ఉమెన్స్ ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నం.1గా లారా వోల్వార్డ్ట్.. రెండో స్థానానికి చేరిన స్మృతి మంధాన
✒ U19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీకి ఎంపికైన ద్రవిడ్ కుమారుడు అన్వయ్ 
News November 4, 2025
జూబ్లీ గెలుపుపై రోజుకో సర్వే వెనుక రహస్యమేమి?

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రోజుకో సర్వే విడుదలవుతోంది. ఇప్పటి వరకు 3 సర్వే సంస్థల నివేదికలు బయటకు వచ్చాయి. గెలుపుపై 2 బీఆర్ఎస్‌కు, 1 కాంగ్రెస్‌కు అనుకూలంగా చెప్పాయి. ఇవి వివాదంగా మారగా 2పార్టీలూ అధికారులకు ఫిర్యాదు చేశాయి. అయితే అనుకూలతను పెంచుకొనేందుకు పార్టీలే ఇలా సర్వే సంస్థల ద్వారా కొత్త ప్రచారం మొదలుపెట్టాయని కొందరు అనుమానిస్తున్నారు. ఈ సర్వేల ప్రభావం తటస్థ ఓటర్లపై పడొచ్చని అంటున్నారు.
News November 4, 2025
న్యూస్ రౌండప్

☛ జూబ్లీహిల్స్ బైపోల్: బీజేపీకి జనసేన మద్దతు
☛ రైతులను కలిసే అర్హత జగన్‌కు లేదు: మంత్రి నిమ్మల
☛ కల్తీ మద్యం కేసులో మరో ఇద్దరు అరెస్ట్.. గోవాలో పని చేస్తున్న శిబూ, జనేశ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
☛ బిహార్‌లో ముగిసిన ఎన్నికల ప్రచారం.. నవంబర్ 6న తొలి విడత పోలింగ్
☛ శ్రీకాకుళం: విద్యార్థుల చేత <<18193619>>కాళ్లు నొక్కించుకున్న<<>> టీచర్ సస్పెండ్
☛ ఎంపీ చిన్నితో ముగిసిన టీడీపీ క్రమశిక్షణ కమిటీ విచారణ  


