News February 6, 2025
భారత్‌తో శాంతి కోరుకుంటున్నాం.. కానీ: పాక్ పీఎం షరీఫ్

శాంతి పేరుతో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి సన్నాయి నొక్కులు నొక్కారు. కశ్మీర్ సహా అన్ని సమస్యలను భారత్‌తో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామని చెప్పారు. అయితే 2019 ఆగస్టు 5 నాటి ఆలోచన(ఆర్టికల్ 370 రద్దు) నుంచి బయటకు రావాలన్నారు. POK అసెంబ్లీలో మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితికి ఇచ్చిన వాగ్దానాన్ని భారత్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Similar News
News March 11, 2026
ఈ టైమ్‌లో ఎండలో నిలబడండి..

భారతదేశంలో సూర్యరశ్మి పుష్కలంగా ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలు విటమిన్-డి లోపంతో సతమతమవుతున్నారు. మీకు 30-100 ng/mL మధ్య ఉంటే డి విటమిన్ సరిపడా ఉందని అర్థం. సహజంగా దీనిని పెంచుకునేందుకు రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య కనీసం 30 నిమిషాలు ఎండలో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎముకల పుష్టికి, రోగనిరోధక శక్తికి ఈ ‘సన్ షైన్’ విటమిన్ ఎంతో కీలకమని పేర్కొన్నారు.
News March 11, 2026
2 రోజుల్లో ₹51,400 కోట్ల ఆయుధాలు

ఇరాన్ యుద్ధంలో అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది. యుద్ధం మొదలైన మొదటి 48 గంటల్లోనే ట్రంప్ యంత్రాంగం సుమారు ₹51,400 కోట్ల విలువైన ఆయుధాలను వాడేసినట్లు సమాచారం. కేవలం క్షిపణులు, బాంబులకే ఇంత ఖర్చు కాగా.. సైనిక మోహరింపు వ్యయం అదనం. ఈ స్థాయిలో ఖర్చు చేయడం అమెరికా కాంగ్రెస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతటి భారీ ఖర్చుతో కూడిన యుద్ధాన్ని పెంటగాన్ ఎంతకాలం కొనసాగించగలదనే దానిపై చర్చలు మొదలయ్యాయి.
News March 11, 2026
ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే?

ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు బిడ్డకు కవచంలా ఉంటూ ఇన్‌ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది. ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే అమ్మకు ఆయాసం ఎక్కువవుతుంది. ఏడో నెల తర్వాతయితే మరింత ఇబ్బంది అవుతుంది. నొప్పులు తొందరగా వస్తాయి. నిర్ణీత కాలం కంటే ముందుగానే ప్రసవం అయిపోతుంది. ఒక్కోసారి బేబీ చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఉమ్మనీరు ఎంత ఉందో చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


