News July 1, 2024

25 వేల పోస్టులైనా ఇస్తారనుకున్నాం: బొత్స

image

AP: మూడు రాజధానులకే తాము కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అదే తమ పార్టీ విధానమన్నారు. పార్టీ ఆఫీసులను కూల్చేయడం, బెదిరించడం తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. యూనివర్సిటీ వీసీలను రాజీనామాలు చేయాలని బెదిరించడం సమంజసం కాదన్నారు. మెగా డీఎస్సీలో 25 వేల పోస్టులు అయినా ఇస్తారనుకున్నామని.. 16వేల పోస్టులకే ఎందుకు పరిమితమయ్యారో తెలియడం లేదని ఆక్షేపించారు.

Similar News

News November 21, 2025

నీటి నిల్వ, సంరక్షణ చర్యలను మెచ్చిన కేంద్రం

image

AP: రాష్ట్రవ్యాప్తంగా డి.సీఎం పవన్ నేతృత్వంలో నీటి నిల్వ, సంరక్షణ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్రం గుర్తించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖకు జల్ శక్తి అవార్డులు వరించాయి. పంచాయతీ క్యాటగిరీలో ప్రథమ స్థానంలో మదనపల్లి మండలం, దుబ్బిగానిపల్లె, ద్వితీయ స్థానంలో ప్రకాశం(జి), పీసీ పల్లె(మం) మురుగమ్మి గ్రామం, జల్ సంచయ్-జన్ భాగీదారీలో దక్షిణ జోన్‌లో నెల్లూరు జిల్లాకు అవార్డు దక్కింది.

News November 21, 2025

బీసీలకు 22% రిజర్వేషన్లు ఖరారు!

image

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22శాతం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బీసీలకు 42శాతం ఇవ్వాలని ప్రభుత్వం భావించినా కోర్టు కేసుల వల్ల సాధ్యపడలేదు. దీంతో 2019లో ఇచ్చినట్లే రాష్ట్రవ్యాప్తంగా 22శాతం ఇవ్వనుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో కలవడం వల్ల మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.

News November 21, 2025

బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

image

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.