News February 17, 2025
ముస్లింలను తొలగిస్తేనే ఆమోదిస్తాం: బండి సంజయ్

TG: రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో కూలుతుందో తెలియడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మంత్రులు 15% కమీషన్ దండుకుంటున్నారని, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందని ఆరోపించారు. ముస్లింలను BCల జాబితా నుంచి తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. కులగణన బిల్లు అలాగే పంపుతామంటే తామెందుకు ఆమోదిస్తామని, ముస్లింలను BCల జాబితా నుంచి తొలగించి పంపితే కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు.
Similar News
News November 16, 2025
3Dలోనూ అఖండ-2

బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలకృష్ణ నటిస్తోన్న అఖండ-2 సినిమాను 3Dలోనూ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యాన్స్కు కొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఫార్మాట్లోనూ తీసుకొస్తున్నట్లు బోయపాటి చెప్పారు. ‘ఈ చిత్రం దేశ ఆత్మ, పరమాత్మ. సనాతన ధర్మం ఆధారంగా మూవీని రూపొందించాం. ఈ సినిమాను దేశమంతా చూడాలనుకుంటున్నాం. అందుకే ముంబై నుంచి ప్రచారం ప్రారంభించాం’ అని పేర్కొన్నారు.
News November 16, 2025
అంబేడ్కర్ ప్రసంగం కంఠోపాఠం కావాలి: సీజేఐ

AP: రాజ్యాంగాన్ని దేశానికి అప్పగిస్తూ అంబేడ్కర్ చేసిన ప్రసంగం లాయర్లకు కంఠోపాఠం కావాలని CJI జస్టిస్ బీఆర్ గవాయ్ చెప్పారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా మంగళగిరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘రాజ్యాంగాన్ని అంబేడ్కర్ ఓ స్థిరపత్రంగా చూడకుండా సవరణ విధానాలనూ పొందుపరిచారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కునూ కల్పించారు’ అని పేర్కొన్నారు.
News November 16, 2025
BREAKING: భారత్ ఓటమి

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో భారత్కు ఊహించని షాక్ ఎదురైంది. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి పాలైంది. టీమ్ ఇండియా 93 పరుగులకే పరిమితమైంది. దీంతో RSA 30 పరుగుల తేడాతో గెలిచింది. సుందర్ 31, అక్షర్ 26, జడేజా 16 రన్స్ చేశారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. మెడనొప్పితో గిల్ సెకండ్ ఇన్నింగ్సులో బ్యాటింగ్కు రాలేదు. SA బౌలర్లలో హార్మర్ 4, జాన్సెన్ 3 వికెట్లతో సత్తా చాటారు.


