News December 13, 2024

మధ్యాహ్నం 2.30గంటలకు చెబుతాం: హైకోర్టు

image

అల్లు అర్జున్‌పై సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని ఆయన తరఫు లాయర్ <<14867578>>కోరడంపై<<>> హైకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల అభిప్రాయం తెలుసుకొని మ.2.30 గంటలకు చెబుతామని వెల్లడించారు. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని లాయర్ కోరగా హైకోర్టు తిరస్కరించింది. ఉ.10.30 గంటలలోపే పిటిషన్ జత చేయాల్సిందని చెప్పింది.

Similar News

News October 21, 2025

భగవద్గీతను ఎవరెందుకు చదవాలి?

image

మానవులందరికీ మార్గదర్శనం చేసే దివ్య గ్రంథం భగవద్గీత. ఉత్తమ జీవితం కోసం ప్రతి ఒక్కరూ గీతను అధ్యయనం చేయాలి. విద్యార్థులు క్రమశిక్షణ కోసం, యువకులు సరైన జీవన విధానం కోసం, వృద్ధులు మరణానంతర ఆలోచనల కోసం, అజ్ఞానులు జ్ఞానం కోసం, ధనవంతులు దయ అలవరుచుకోవడానికి, బలవంతులు దిశానిర్దేశం కోసం, కష్టాల్లో ఉన్నవారు పరిష్కారం కోసం భగవద్గీతను చదవాలి.
* రోజూ ఇలాంటి ఆసక్తికర కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి<<>> క్లిక్ చేయండి.

News October 21, 2025

నేడు..

image

* మంగళగిరిలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు
* హైదరాబాద్‌లోని గోషామహల్‌లో అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో నివాళులు అర్పించనున్న టీజీ సీఎం రేవంత్
* జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లకు నేడే ఆఖరు.. ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్న బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి
* ఇవాళ WWCలో తలపడనున్న దక్షిణాఫ్రికా, పాకిస్థాన్

News October 21, 2025

అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అనంతరం 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఇవాళ APలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అటు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఈ నెల 23 ఉదయం 8.30 గంటల వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.