News March 27, 2025
ఆరు గ్యారంటీలు నెరవేర్చాకే ఓట్లు అడుగుతాం: శ్రీధర్ బాబు

TG: సీఎం రేవంత్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగొద్దని కొందరు కుట్ర చేశారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. లగచర్ల ఘటన వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసన్నారు. మేనిఫెస్టోలోని అంశాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. ఆరు గ్యారంటీలు నెరవేర్చాకే 2028 ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీయొద్దని ప్రతిపక్ష నేతలకు సూచించారు.
Similar News
News March 30, 2025
టెన్త్ పాసై ఈత వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు

నేవీలో 327 బోట్ క్రూ స్టాఫ్ (గ్రూప్ C) పోస్టుల దరఖాస్తుకు ఏప్రిల్ 1తో గడువు ముగియనుంది. 57 సిరాంగ్ ఆఫ్ లాస్కర్స్, 192 లాస్కర్-1, 73 ఫైర్‌మ్యాన్ (బోట్ క్రూ), 5 టోపాస్ పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టులకు పదో తరగతి పాస్ కావడంతో పాటు ఈత రావాలి. లాస్కర్ సిరాంగ్ పోస్టులకు అదనంగా రెండేళ్లు, లాస్కర్-1 పోస్టులకు ఒక ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 18-25 ఏళ్లు. పూర్తి వివరాలకు సైట్: joinindiannavy.gov.in/
News March 30, 2025
రంజాన్ లౌకికవాదానికి ప్రతీక: సీఎం రేవంత్

TG: ముస్లింలకు సీఎం రేవంత్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘రంజాన్ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దానధర్మాలు మానవాళికి ఆదర్శం. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుంది’ అని తెలిపారు.
News March 30, 2025
ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

న్యూక్లియర్ ఒప్పందానికి అంగీకరించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌ను యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. టారిఫ్‌లు రెట్టింపు చేయడమే కాకుండా అవసరమైతే బాంబు దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు యూఎస్ విధిస్తున్న ఆంక్షలతో ఇరాన్ గతంలో ఎప్పుడూ లేనంతగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.