News July 25, 2024
తుమ్మడిహట్టిపై బ్యారేజీ కడతాం: మంత్రి ఉత్తమ్

TG: తుమ్మడిహట్టిపై బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలిలో స్పష్టం చేశారు. 3, 4 నెలల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అక్కడ ప్రాజెక్టు కడితే పుష్కలంగా నీళ్లు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇక కాళేశ్వరం బ్యారేజీలపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ తెలిపారు.
Similar News
News December 5, 2025
పుతిన్ సంపద ఎంత.. బిల్ గేట్స్ కన్నా ధనవంతుడా?

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన నేతల్లో పుతిన్ ఒకరు. ఆయనకు ఏడాదికి రూ.1.25 కోట్ల జీతం వస్తుందని, 800 చ.అ. అపార్ట్మెంట్, ప్లాట్, 3 కార్లు ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి. కానీ పుతిన్ సంపద $200 బిలియన్లకు పైనే అని ఫైనాన్షియర్ బిల్ బ్రౌడర్ గతంలో చెప్పారు. ఇది బిల్ గేట్స్ సంపద ($113B-$128B) కన్నా ఎంతో ఎక్కువ. ఆయనకు విలాసవంతమైన ప్యాలెస్, షిప్, ఎన్నో ఇళ్లు, విమానాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.
News December 5, 2025
భగవంతుడిపై నమ్మకం ఎందుకు ఉంచాలి?

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః|
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్||
దేవుడు మనలోనే అంతరాత్మగా ఉంటాడు. ధనుస్సు ధరించి పరాక్రమంతో ధైర్యాన్నిస్తాడు. ప్రజ్ఞావంతుడు, ఉన్నత క్రమశిక్షణ గల ఆయన అన్ని విషయాలకు అతీతంగా ఉంటాడు. ఎవరూ భయపెట్టలేని విశ్వాసపాత్రుడు మన కార్యాలను నెరవేరుస్తూ, సకల ఆత్మలకు మూలమై ఉంటాడు. మనం ఆ పరమాత్మను గుర్తించి, విశ్వాసం ఉంచి ధైర్యంగా జీవించాలి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 5, 2025
225 అప్రెంటిస్లకు దరఖాస్తుల ఆహ్వానం

పాటియాలా లోకోమోటివ్ వర్క్స్ 225 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులు అర్హులు. అప్రెంటిస్ల గరిష్ఠ వయసు 24ఏళ్లు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ముందుగా www.apprenticeshipindia.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్సైట్: https://plw.indianrailways.gov.in


