News February 16, 2025

చిరంజీవికి జీవితాంతం రుణపడి ఉంటాం: హీరోయిన్

image

మెగాస్టార్ చిరంజీవిపై హీరోయిన్ ఊర్వశి రౌతేలా పొగడ్తల వర్షం కురిపించారు. చిరు తనకు దేవుడి వంటి వారని అన్నారు. తన తల్లి కాలికి ఫ్రాక్చర్‌తో బాధపడుతున్నారని మెగాస్టార్‌కు చెప్పగా వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చేశారని చెప్పారు. దాంతో తన అమ్మకు సర్జరీ జరగ్గా సమస్య నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఊర్వశి వెల్లడించారు. ఆయనకు తమ కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుందన్నారు.

Similar News

News November 20, 2025

NGKL: గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం: కలెక్టర్

image

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితా సవరణ, తుది ప్రచురణపై చర్చించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సౌకర్యాలు, సాంకేతిక ఏర్పాట్లపై సమీక్షించారు.

News November 20, 2025

ఇంటర్నేషనల్ న్యూస్ రౌండప్

image

☛ 16 ఏళ్లలోపు టీనేజర్లు సోషల్‌మీడియా వాడకూడదనే నిబంధన ఆస్ట్రేలియాలో డిసెంబర్ 10 నుంచి అమలులోకి రానుంది. ఆ టీనేజర్ల అకౌంట్లను ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేయనుంది.
☛ ఇండోనేషియాలోని సీరమ్ ఐలాండ్‌లో 6.0 తీవ్రతతో భూమి కంపించినట్లు సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది.
☛ చెక్ రిపబ్లిక్‌ సౌత్ ప్రాగ్‌కు 132 కి.మీ దూరంలో 2 ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా, 40 మంది స్వల్పంగా గాయపడ్డారు.

News November 20, 2025

తిరుమలలో గంటల శబ్దం వచ్చేది ఇక్కడి నుంచే..

image

తిరుమల వేంకటేశ్వర స్వామికి నైవేద్యం సమర్పించేటప్పుడు గంటల శబ్దాలు వినిపిస్తుంటాయి. ఆ గంటలున్న మండపాన్ని తిరుమామణి అని అంటారు. ఇందులో ముఖ్యంగా రెండు గంటలు ఉంటాయి. మొదటిది నారాయణ గంట. రెండవది గోవింద గంట. చారిత్రక ఆధారాల ప్రకారం.. ఈ మండపాన్ని సామాన్య శకం 1417వ సంవత్సరంలో మాధవదాసు అనే భక్తుడు నిర్మించాడు. స్వామివారి నివేదన వేళ ఆయన్ను స్మరించుకోవడానికి ఈ మండపం ఒక ముఖ్యమైన భాగం. <<-se>>#VINAROBHAGYAMU<<>>