News September 20, 2024

సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం: వాలంటీర్ల అసోసియేషన్

image

AP: ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలోనూ వాలంటీర్లపై నిర్ణయం తీసుకోకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. 100 రోజులుగా కూటమి ప్రభుత్వం తమను మోసం చేస్తోందని వాలంటీర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెల 2 నుంచి 26 వరకు శాంతియుతంగా వినూత్న రీతిలో ఆందోళనలు చేస్తామని తెలిపారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలోగా న్యాయం చేయకపోతే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

Similar News

News February 8, 2026

స్వల్పంగా తగ్గిన చికెన్ ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు కాస్త తగ్గాయి. గుంటూరు, తిరుపతిలో స్కిన్‌లెస్ కేజీ రూ.220-230 వరకు పలుకుతోంది. అటు హైదరాబాద్‌లో మాత్రం కేజీ రూ.270-280 ఉంది. విజయవాడ, కామారెడ్డిలోనూ రూ.270 వరకు విక్రయిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో మటన్ కేజీ ధర రూ.900-1,000 వరకు ఉంది. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.

News February 8, 2026

భారత్-అమెరికా డీల్: రష్యాతో దోస్తీకి ముప్పు పొంచి ఉందా?

image

అమెరికాతో ట్రేడ్ డీల్ కుదిరినా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గినా.. మాస్కోతో భారత మైత్రికి ఢోకా ఉండదని విశ్లేషకులు అంటున్నారు. మన రక్షణ వ్యవస్థలో ఇప్పటికీ చాలా ఆయుధాలు రష్యావే. S-400 మిస్సైల్స్, అణుశక్తి వంటి విషయాల్లో ఆ దేశమే మన నమ్మకమైన భాగస్వామి. మరోవైపు చైనాను కట్టడి చేయాలన్నా మనకు పుతిన్ సహకారం చాలా కీలకం. అటు అమెరికా టెక్నాలజీని, ఇటు రష్యా నమ్మకాన్ని భారత్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది.

News February 8, 2026

సిరాజ్ మియా.. హాలిడే ప్లాన్ నుంచి WCలోకి సడన్ ఎంట్రీ

image

సిరాజ్ అసలు ప్లాన్ జర్మనీకి హాలిడే ట్రిప్, స్పెయిన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్. కానీ హర్షిత్ గాయంతో T20 WCలో ఆడే అవకాశం వచ్చింది. దీనికి తోడు బుమ్రా అస్వస్థత వల్ల నేరుగా ప్లేయింగ్ 11లో చోటు దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సిరాజ్ పవర్‌ప్లేలోనే వికెట్లు తీసి USను దెబ్బకొట్టారు. 3/29తో అదరగొట్టడంతో భారత్ విజయం సాధించింది. ‘దేవుడు రాసిన రాతను ఎవరూ మార్చలేరు’ అంటున్నారు ఈ హైదరాబాదీ మియా!