News September 27, 2024
జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటాం: స్వామీజీలు

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని స్వామీజీలు హెచ్చరించారు. ‘గత ఐదేళ్లలో జగన్ తిరుమల పవిత్రతను కాపాడలేదు. దర్శనానికి వెళ్లినా డిక్లరేషన్ ఇవ్వలేదు. మరోసారి తిరుమలలో జగన్ డ్రామాకు తెరతీసే అవకాశం ఉంది. అలిపిరి దగ్గరే మాజీ సీఎంను అడ్డుకుంటాం.’ అని వారు హెచ్చరించారు.
Similar News
News November 24, 2025
NGKL: జిల్లాలో గత ఐదు రోజులుగా తగ్గిన చలి..!

నాగర్కర్నూల్ జిల్లాలో గత ఐదు రోజులుగా చల్లి తీవ్రత తగ్గుతుంది. చారకొండ మండలం సిర్సనగండ్లలో 18.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తోటపల్లి, అమ్రాబాద్ 18.7, వెల్దండ 18.8, ఎంగంపల్లి 19.0, తెలకపల్లి, కొండారెడ్డిపల్లి 19.1, నాగర్కర్నూల్, బిజినేపల్లి 19.3, కుమ్మెర 19.5, ఊర్కొండ 19.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
News November 24, 2025
ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News November 24, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 710 తగ్గి రూ.1,25,130కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 650 పతనమై రూ.1,14,700 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,71,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


