News March 25, 2024
రూ.4వేల పింఛన్ ఇంటికే తెచ్చిస్తాం: చంద్రబాబు

AP: టీడీపీ, జనసేన, బీజేపీల అజెండా ఒక్కటేనని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సాయం అవసరమన్నారు. ఈసారి 160 అసెంబ్లీ, 24 లోక్సభ స్థానాల్లో గెలవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.4వేల పింఛన్ ఇంటికే తెచ్చిస్తామని ప్రకటించారు. ముస్లింల 4శాతం రిజర్వేషన్లు కాపాడింది తమ పార్టీయేనని బాబు గుర్తు చేశారు.
Similar News
News December 7, 2025
మీ పిల్లలను ఇలా మోటివేట్ చేయండి

పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత. “నా వల్ల కాదు” అని చెప్పే అలవాటు ఉంటే సరైన ప్రోత్సాహంతో దాన్ని మార్చవచ్చు. ఫలితాలకంటే ప్రయత్నాన్ని ప్రశంసించాలి. “నీవు చేయగలవు”, “మళ్లీ ప్రయత్నించు” అని చెప్తే సానుకూల దృక్పథంతో ఆలోచిస్తారు. వారికి చిన్నచిన్న నిర్ణయాలు సొంతంగా తీసుకునే అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల నమ్మకమే పిల్లల్లో ఆత్మవిశ్వాసానికి బలమైన పునాది అవుతుంది.
News December 7, 2025
ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం Jr.NTR చాలా సన్నగా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కొత్త లుక్ వైరల్ అవుతోంది. గాగుల్స్ పెట్టుకుని సోఫాలో కూర్చున్న ఫొటో చూసి లుక్ బాగుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కొత్త షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో బాడీ డబుల్ లేకుండా ఎన్టీఆరే స్టంట్స్ చేస్తారని సమాచారం.
News December 7, 2025
మామిడిలో బోరాన్, పొటాష్ లోపాన్ని ఎలా గుర్తించాలి?

మామిడిలో బోరాన్ లోపం వల్ల చెట్ల ఆకులు కురచగా మారి ఆకుకొనలు నొక్కుకుపోయి పెళుసుగా మారతాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి. దీని నివారణకు ప్రతి మొక్కకు 100గ్రా. బోరాక్స్ భూమిలో వేయాలి. లేదా లీటరు నీటికి 1ml-2ml బోరాక్స్ లేదా బోరికామ్లం కొత్త చిగురు వచ్చినప్పుడు 1-2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుల అంచులు ఎండిపోతే పొటాష్ లోపంగా గుర్తించాలి. దీని నివారణకు లీటరు నీటికి 13:0:45 10గ్రా. కలిపి పిచికారీ చేయాలి.


