News April 14, 2025
అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని మళ్లీ తీసుకొస్తాం: CM

AP: అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. గుంటూరు(D) పొన్నెకల్లులో మాట్లాడుతూ ‘పేదలకు అండగా ఉంటాం. రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన విద్య, భోజనం అందిస్తాం. అమరావతికి ప్రతిష్టాత్మక వర్సిటీలు, కాలేజీలను తీసుకొస్తాం’ అని తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ చూడని రాజకీయం 2019-24 మధ్య చూశానని, తనలాంటి వాళ్లు కూడా బయటకు రాని పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించారు.
Similar News
News April 15, 2025
ఏడాదిలో గిరిజన యూనివర్సిటీ నిర్మాణం: సీఎం

AP: VZM(D) మెంటాడ(మ) కుంటినవలసలో నిర్మిస్తున్న కేంద్ర గిరిజన యూనివర్సిటీ నిర్మాణం ఏడాదిలోగా పూర్తి చేయాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వర్సిటీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది నియామకం కోసం ప్రధానికి లేఖ రాస్తానని తనను కలిసిన వర్సిటీ వీసీ, అధికారులకు CBN బదులిచ్చారు. 561 ఎకరాల ప్రాంగణం ఉన్న ఈ యూనివర్సిటీలో ప్రస్తుతం 600 మంది విద్యార్థులు చదువుతున్నారు.
News April 15, 2025
గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు.. టీజీపీఎస్సీ క్లారిటీ

గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ కొందరు దురుద్దేశంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీజీపీఎస్సీ తెలిపింది. దీని వెనుక ప్రైవేటు కోచింగ్ సెంటర్లు ఉన్నాయని పేర్కొంది. ప్రోటోకాల్ ప్రకారమే నిపుణులతో వాల్యూయేషన్ చేయించినట్లు స్పష్టం చేసింది. లిమిటెడ్ మార్కుల పరీక్షల్లో ఒకే మార్కులు రావడం సహజమని తేల్చి చెప్పింది.
News April 15, 2025
పవన్ కుమారుడిపై అనుచిత వ్యాఖ్యలు.. నిందితుల అరెస్ట్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఆ అంశంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ప్రత్తిపాడు పీఎస్లో కేసు నమోదైంది. తాజాగా నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్క్తో పాటు పవన్ భార్యపైనా వీరు తప్పుడు పోస్టులు పెట్టినట్లు సమాచారం.