News October 7, 2025
డిజిటల్ కరెన్సీ తీసుకొస్తాం: పీయూష్ గోయల్

భారత్ కూడా త్వరలో డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయనుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ‘మేం క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేయనప్పటికీ దానిని ప్రోత్సహించట్లేదు. దానికి కేంద్రం, RBI మద్దతు లేదు. సావరిన్/అసెట్స్ బ్యాకింగ్ లేదు. RBI గ్యారంటీతో భారత్ తీసుకొచ్చే డిజిటల్ కరెన్సీతో పేపర్ వాడకం తగ్గుతుంది. ట్రాన్సాక్షన్స్ వేగంగా, సులభంగా జరుగుతాయి. దీనికి ట్రేసింగ్ సామర్థ్యం కూడా ఉంటుంది’ అని తెలిపారు.
Similar News
News October 7, 2025
మిథాలికి ACA అరుదైన గౌరవం

భారత మాజీ క్రికెటర్ మిథాలి రాజ్‌కు ఆంధ్ర క్రికెట్ సంఘం(ACA) అరుదైన గౌరవం కల్పించింది. వైజాగ్‌లోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో స్టాండ్‌కు మిథాలి పేరు పెట్టాలని నిర్ణయించింది. మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కల్పన పేరును ఎంట్రన్స్‌కు పెట్టనుంది. ఈ మైదానంలోనే భారత మహిళల జట్టు ఈ నెల 9న సౌతాఫ్రికాతో, 12న ఆస్ట్రేలియాతో WC మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే రెండు మ్యాచులు గెలిచి జోష్‌లో ఉన్న హర్మన్ సేన వైజాగ్ చేరుకుంది.
News October 7, 2025
ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై కేంద్రమంత్రి శుభవార్త

రాబోయే 4-6 నెలల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు పెట్రోల్ వాహనాలతో సమానం అవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇంధనం వల్ల పర్యావరణానికి హాని కలగడమే కాకుండా దిగుమతుల రూపంలో ఏడాదికి రూ.22 లక్షల కోట్లు ఖర్చవుతున్నాయని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీని ప్రపంచంలోనే నం.1 చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం ఆ ఇండస్ట్రీ విలువ రూ.22 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పారు.
News October 7, 2025
అధికారికంగా కొమురం భీం వర్ధంతి.. ఇవాళ స్కూళ్లకు సెలవు

TG: గిరిజనుల ఆరాధ్యుడు కొమురం భీం వర్ధంతిని ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 85వ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్‌లో NOV 8, ఆదిలాబాద్‌లో DEC 13న(రెండో శనివారాలు) స్కూళ్లు పనిచేస్తాయని తెలిపారు.