News July 26, 2024
కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు తెప్పిస్తాం: పవన్ కళ్యాణ్

AP: చిత్తూరు, మన్యం జిల్లాల్లో ఏనుగులు పంటలు ధ్వంసం చేయడాన్ని అడ్డుకోవాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అటవీశాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ‘పొలాలు, ఇళ్లలోకి వచ్చే ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపేందుకు కావాల్సిన కుంకీ ఏనుగులను కర్ణాటక నుంచి తెప్పిస్తాం. ఆ ప్రభుత్వంతో మాట్లాడుతా. జంతువులు రాకుండా పొలాల్లో ఏర్పాటు చేసే విద్యుత్ ఫెన్సింగులు వద్దని ప్రజలకు వివరించాలి’ అని ఆయన చెప్పారు.
Similar News
News December 1, 2025
మా రాజీనామాలను ఆమోదించండి: ఎమ్మెల్సీలు

AP: వైసీపీ, MLC పదవులకు రిజైన్ చేసిన ఆరుగురు నాయకులు ఇవాళ మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజుతో సమావేశమయ్యారు. ఎలాంటి ప్రలోభాలకూ గురికాకుండా స్వచ్ఛందంగానే తాము రిజైన్ చేశామని, వాటిని ఆమోదించాలని కోరారు. రాజీనామా వెనక్కు తీసుకునే ఆలోచన ఉందా? అని ఛైర్మన్ అడగగా లేదని తేల్చిచెప్పారు. మోషేన్ రాజును కలిసిన వారిలో పద్మశ్రీ, చక్రవర్తి, మర్రి రాజశేఖర్, వెంకటరమణ, జాకియా, పోతుల సునీత ఉన్నారు.
News December 1, 2025
స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు

భారత సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 64.77 పాయింట్లు నష్టపోయి 85,641 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 26,175 వద్ద క్లోజ్ అయ్యింది. హ్యుండాయ్, టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ Ltd, కోటక్ మహీంద్రా బ్యాంక్, HCL షేర్లు లాభాలు పొందాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, DLF Ltd, ఒబెరాయ్ రియాల్టీ Ltd షేర్లు నష్టాల్లో ముగిశాయి.
News December 1, 2025
క్యారెట్ సాగు – ముఖ్యమైన సూచనలు

క్యారెట్ శీతాకాలం పంట. దీన్ని ఆగస్టు-డిసెంబర్ మధ్యలో నాటుకోవచ్చు. నాణ్యమైన దిగుబడి రావాలంటే 18-24 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత అవసరం. క్యారెట్ సాగుకు మురుగునీటి వసతి గల లోతైన, సారవంతమైన గరప నేలలు అత్యంత అనుకూలం. బరువైన బంకనేలలు పనికిరావు. నేల ఉదజని సూచిక 6.5గా ఉంటే మంచిది. ఎకరాకు 2 కేజీల విత్తనాలు అవసరం. ప్రతి 15 రోజుల తేడాలో విత్తనాలు విత్తుకుంటే డిమాండ్కు అనుగుణంగా మంచి దిగుబడి సాధించవచ్చు.


