News July 26, 2024
మధ్యతరగతి కోసం మరిన్ని పథకాలు తెస్తాం: నిర్మలా సీతారామన్

మధ్యతరగతి ప్రజల కోసం మరిన్ని స్కీమ్స్ తెచ్చేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఒక స్కీమ్/అంశంపైనే దృష్టి సారించడం సరికాదన్నారు. దీనిపై ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మిడిల్ క్లాస్ కోసం స్టాండర్డ్ డిడక్షన్ ₹75వేలకు పెంచామని, పిల్లల చదువులకు ₹10లక్షల వరకు సబ్సిడీ లోన్ సదుపాయం తెచ్చామన్నారు. విదేశాల్లో భారతీయులు ఖర్చు చేసే పరిమితిని పెంచామన్నారు.
Similar News
News October 18, 2025
పవన్-లోకేశ్ కాంబోలో సినిమా?

టాలీవుడ్లో క్రేజీ కాంబో సెట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ పవన్‌తో మూవీ లాక్ చేసుకుంది. ఆ అవకాశం తమిళ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్‌కు దక్కబోతోందని టాలీవుడ్లో టాక్ స్టార్ట్ అయ్యింది. అలాగే డైరెక్టర్ హెచ్.వినోద్ పేరు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నట్లు చెబుతున్నారు.
News October 18, 2025
కంటెంట్ క్రియేటర్లకు మస్క్ గుడ్‌న్యూస్

‘X’ అధినేత ఎలాన్ మస్క్ కంటెంట్ క్రియేటర్లకు గుడ్‌న్యూస్ చెప్పారు. తమ ఫీడ్ రికమెండేషన్ అల్గారిథమ్‌ను మార్చబోతున్నట్లు తెలిపారు. ‘6 వారాల్లో ఫీడ్ రికమెండేషన్ Grok AIకు అప్పగిస్తాం. అది ప్రతి పోస్టు, రోజుకు 100మి+ వీడియోలు చూస్తుంది. ఇంట్రెస్టింగ్ కంటెంట్‌ను రికమెండ్ చేస్తుంది’ అని తెలిపారు. అంటే పేజ్, ఫాలోవర్లతో సంబంధం లేదు. మీ కంటెంట్ ఇంట్రెస్టింగ్గా ఉంటే అది ఆటోమేటిక్‌గా వైరలయ్యే ఛాన్సుంటుంది.
News October 18, 2025
అక్టోబర్ 18: చరిత్రలో ఈ రోజు

1931: విద్యుత్ బల్బు ఆవిష్కర్త థామస్ అల్వా ఎడిసన్ మరణం
1968: భారత మాజీ క్రికెటర్ నరేంద్ర హిర్వాణి జననం
1976: కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మరణం
1978: సినీ నటి జ్యోతిక జననం
1991: భారత మాజీ క్రికెటర్ జయదేవ్ ఉనడ్కట్ జననం
2004: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ మరణం
2013: రచయిత రావూరి భరద్వాజ(ఫొటోలో) మరణం