News September 16, 2024
అమరావతిలో 360 కి.మీ మేర రోడ్లు నిర్మిస్తాం: మంత్రి

AP: అమరావతిలో నిర్మాణాల కోసం డిసెంబర్ నెలాఖరులోగా టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ‘రాజధానిలో 360 కి.మీ మేర రోడ్లు నిర్మిస్తాం. గతంలో నిర్మించిన భవనాలు దెబ్బతినలేదని IIT నిపుణులు నివేదికిచ్చారు. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్తో పాటు పంపింగ్ స్టేషన్లు డిజైన్ చేశాం. మొత్తం ఆరు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ పూర్తయితే అమరావతిలో వరద సమస్య ఉండదు’ అని తెలిపారు.
Similar News
News November 17, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* కడప జిల్లాలోని పుష్పగిరిలో 13వ శతాబ్దానికి చెందిన శాసనాలను పురావస్తు శాఖ గుర్తించింది.
* కల్తీ నెయ్యి కేసులో నిందితుడైన A24 చిన్న అప్పన్నను నేటి నుంచి 5 రోజులపాటు సిట్ విచారించనుంది. ఇదే కేసులో TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి ఈ నెల 19/20న విచారణకు హాజరుకానున్నారు.
* TTD మాజీ ఏవీఎస్వో సతీశ్ మృతి కేసును గుత్తి రైల్వే పోలీసుల నుంచి తాడిపత్రి పోలీసులకు బదిలీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
News November 17, 2025
SAILలో 124 పోస్టులు.. అప్లై చేశారా?

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL)లో 124 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ 65% మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు DEC 5వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1050, SC, ST, PwBDలకు రూ.300 వెబ్సైట్: www.sail.co.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 17, 2025
RGNIYDలో ఉద్యోగాలు

రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ (<


