News October 8, 2025

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టితీరుతాం: మంత్రి ఉత్తమ్

image

TG: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని కట్టి తీరుతామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ‘2 అలైన్‌మెంట్లను పరిశీలిస్తున్నాం. ఈనెల 22 నాటికి ఒక దానిని ఖరారు చేస్తాం. 1st అలైన్‌మెంట్‌లో తుమ్మిడిహెట్టి-మైలారం 71.5kms గ్రావిటీ కెనాల్, 14kms టన్నెల్ ద్వారా సుందిళ్లకు నీటి తరలింపు, 2nd దానిలో పంపింగ్ స్టేషన్‌తో ఎల్లంపల్లికి నేరుగా నీటిని తరలించే ప్లాన్ ఉంది’ అని తెలిపారు.

Similar News

News March 27, 2026

వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్

image

వాట్సాప్ సూపర్ ఫీచర్‌ను ప్రకటించింది. వ్యక్తిగత, గ్రూప్ చాట్స్(ఫొటోలు, వీడియోలు సహా), కాల్ హిస్టరీ, కమ్యూనిటీస్, వాట్సాప్ ఛానల్ అప్డేట్స్‌ను మరో ప్లాట్‌ఫామ్‌లోకి మార్చుకొనే వీలు కల్పించింది. అంటే మరో వాట్సాప్‌/ఇతర మెసేజింగ్ యాప్స్‌కు సమాచారాన్ని బదిలీ చేసుకోవచ్చు. దీనివల్ల స్టోరేజీ ఇబ్బంది ఉండదు. ఇకపై ఐఫోన్‌లోనూ 2 అకౌంట్లు వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ మధ్య చాట్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

News March 27, 2026

పెళ్లిపై స్పందించిన సాయి పల్లవి

image

తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు హీరోయిన్ సాయి పల్లవి ఫుల్ స్టాప్ పెట్టారు. ఓ ప్రోగ్రామ్‌లో జర్నలిస్టులు పెళ్లి గురించి అడగ్గా ఆమె స్పందించారు. ‘ప్రస్తుతం నా పూర్తి దృష్టి కెరీర్‌పైనే ఉంది. పెళ్లి గురించి ఇప్పట్లో ఎలాంటి ఆలోచన లేదు. నేను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నా’ అని చెప్పారు. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘ఏక్ దిన్’ అనే సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు.

News March 27, 2026

అలా అయితే ధోనీ IPL ఆడొద్దు: అశ్విన్

image

IPL-2026లో CSK లెజెండ్ ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడొద్దని మాజీ క్రికెటర్ అశ్విన్ అన్నారు. ‘ధోనీ ప్లేయింగ్-11లోనే ఉండాలి. 3 నెలల నుంచి ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆడగలననే నమ్మకం ఉంది కాబట్టే అలా చేశారు. ఒకవేళ తుది జట్టులో లేకపోతే టోర్నీ మొత్తానికే ఆడకూడదు. ఫీల్డ్‌లో ఉంటే కెప్టెన్ రుతురాజ్‌కు సపోర్ట్ ఇస్తారు. ఒకవేళ ధోనీకి ఆడాలని లేకపోతే రిటైర్ అవుతారు’ అని అభిప్రాయపడ్డారు.